Mythri Movies Makers New Movie :ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను రేపు (మే 09) ఉదయం 11.07 గంటలకు ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అయితే హీరో ఎవరా అన్న విషయం చెప్పలేదు. దీంతో రేపు విజయ్ దేవరకొండ బర్త్ డే అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్‌లో హీరో విజయే అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు
మరోవైపు యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా రూపొందిస్తున్న సినిమాలోనూ విజయ్ నటించనున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి తోనూ విజయ్ ఓ సినిమా తీయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలె 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. గతంలో వచ్చిన 'ఖుషి' సినిమా కూడా సినీ ప్రేక్షకులను నిరాశపరిచింది.