తెలంగాణ

telangana

సింహాసనం కోసం గుడ్డూతో కాలీన్ భయ్యా పోరాటం - ఆసక్తికరంగా మీర్జాపుర్ 3 ట్రైలర్ - Mirzapur 3 Trailer

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 5:09 PM IST

Mirzapur 3 Trailer : అటు నార్త్​తో పాటు ఇటు సౌత్​లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న మీర్జాపుర్ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్​తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమె జాన్ ప్రైమ్ ఈ సిరీస్​కు సంబంధించిన ఆసక్తికరమైన ట్రైలర్​ను పంచుకుంది. దాన్ని మీరూ ఓ లుక్కేయండి.

Mirzapur 3 Trailer
Mirzapur 3 Trailer (Getty Images)

Mirzapur 3 Trailer :ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్​ నుంచి ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అందులో ప్రత్యేకంగా నిలిచి, విశేష ఆదరణ అందుకున్న దాంట్లో 'మీర్జాపుర్' ఒకటి. పంకజ్ త్రిపాఠి, విజయ్‌ వర్మ , అలీ ఫజల్‌, ఇషా తల్వార్ లాంటి స్టార్స్ నటించిన ఈ సిరీస్​ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. తొలి సీజన్ హిట్ కావడం వల్ల మేకర్స్ కూడా సెకెండ్ పార్ట్​తో అభిమానులను అలరించారు. అయితే తాజాగా ఈ సిరీస్​కు మరో సీజన్ ఉంటుందని అఫీషియల్​గా అనౌన్స్ చేసి ఆడియెన్స్​ను ఫుల్ హ్యాపీ చేశారు. అంతే కాకుండా పార్ట్ 3కి సంబందించిన ట్రైలర్​ను కూడా విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఆ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే?

గుడ్డూ భయ్యా (అలీ ఫజల్), కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠీ) మధ్య జరగనున్న పోరు గురించే ఈ మూడో సీజన్ నడవనున్నట్లు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు మేకర్స్. రెండో సీజన్​లో తీవ్ర గాయాలతో గుడ్డూ నుంచి తప్పించుకున్న కాలీన్ భయ్యా, మళ్లీ తన సింహాసనాన్ని చేజిక్కించుకునేందుకు ఎలా పోరాడుతాడో అన్న విషయాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకోవడానికి కాలీన్ భయ్యా మాత్రమే కాదు ఆయనతో పాటు మరిన్ని శక్తులు కూడా గుడ్డూ భయ్యా మీదికి రానున్నాయి. వాటినన్నింటినీ గుడ్డూ అడ్డుకుంటాడన్నది ఈ సీజన్లో చూడొచ్చు. ట్రైలర్ చివరిలో కాలీన్ భయ్యా ఎంట్రీ ఇచ్చాడు. "ఈ సింహాసనం, ఈ పరంపర నాన్న, నేను కలిసి తయారుచేశాం. ఇక ఇప్పుడు పూర్వాంచల్​లో గతంలో ఎన్నడూ చూడనిది చేయాల్సిన సమయం ఆసన్నమైంది" అంటూ సూపర్ డైలాగ్ చెప్తూ సందడి చేశాడు.

ఎప్పుడు స్ట్రీమింగ్​ కానుందంటే?
తాజాగా ఈ సీజన్ స్ట్రీమింగ్ డేట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ అనౌన్స్​ చేసింది. ఈ కొత్త సీజన్ జులై 5 నుంచి యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
Mirzapur awards: 'మీర్జాపుర్' సిరీస్​కు ఇంటర్నేషనల్​ అవార్డులు

మీర్జాపూర్ మున్నా భయ్యా సినీ కష్టాలు - రూ.32 కోసం హోటల్​లో వర్కర్​గా! - Divyendu Sharma

ABOUT THE AUTHOR

...view details