Richest Actor In Bollywood : సినీ ప్రపంచంలో ఎంతో మంది నటీనటలు ఏమీ లేని స్థాయి నుంచి సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదిగిన వాళ్లు ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌ల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. కానీ, ఓ నటుడు కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించి ఇప్పుడు బాలీవుడ్లో రిచెస్ట్ పర్సన్‌గా రికార్డుకెక్కారు. ఇంతకీ ఆయన ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భర్త రాజ్ కుంద్రాకు, సినిమాల కంటే బిజినెస్‌పైనే ఇంట్రెస్ట్. దీంతో ఆయన పలు రకాల వ్యాపార రంగాల్లో రాణించాలని అనుకున్నారు. కొన్నింటిలో సక్సెస్ అయ్యారు కూడా. కానీ అనేక కాంట్రవర్సీల నడుమ చిక్కుకున్నారు. అయితే ఒకానొక సమయంలో ఆయన తన బిజినెన్ను ఎలా ప్రారంభించారంటే?
రాజ్ కుంద్రా ఇండియాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ, వారి కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వెళ్లింది. దీంతో ఆయన బాల్యమంతా లండన్‌లోనే గడిచింది. ఇక కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఆయన అనుకోకుండా దుబాయ్ వెళ్లారు. అక్కడి నేపాల్ వెళ్లి అక్కడ శాలువాల వ్యాపారం మొదలుపెట్టారు. బ్రిటన్‌లోని ఫ్యాషన్ రిటైలర్స్‌కు వాటిని అమ్మి బాగా సంపాదించారు.
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నారు. ఇక తన సొంత బ్యానర్‌పై తెరకెక్కిన 'UT 69' అనే బయోపిక్‌లో నటించారు. కొంతకాలానికి అశ్లీల సినిమాలు చిత్రీకరిస్తున్నారంటూ ముంబయి జైలులో ఖైదీగా ఉన్నాడు. కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ప్రస్తుతం రాజ్ కుంద్రా ఆస్తుల విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇది ఇప్పటి కొంతమంది ప్రముఖ హీరోల ఆస్తుల కంటే ఎక్కువేనని సమాచారం.
ఇదిలా ఉండగా, రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటుగా వీరికి గ్రూప్కో డెవలపర్స్, టీఎంటీ గ్లోబల్స్ లాంటి సంస్థల్లో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయని సమాచారం. సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్‌లో ఒకటైన జేఎల్ స్ట్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు రాజ్ కుంద్రా.
10 నిమిషాల పెర్ఫామెన్స్‌కు రూ.కోటిన్నర- స్టార్ హీరోల్లా ఈ సింగర్ లైఫ్! - Star Charges Rs1Cr For 10 Min
సల్మాన్ సినిమాతో పాపులరైన హీరోయిన్ - ఇప్పుడు మూవీస్‌కు నో అంటోంది! - Actress Got Popular By Salman Movie