Manmadhudu Heroine Anshu re entry : అన్షు అంబానీ ఈ పేరు చెబితే గుర్తు పట్టడం కష్టం. కానీ మన్మథుడు హీరోయిన్ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమాతో అంతలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర చిత్రంలోనూ మెరిసింది. అలా అప్పట్లో తన అందంతో యూత్‌ను బానే ఆకట్టుకుంది.
ఆ తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్, ఒక తమిళ సినిమాలోనూ నటించింది అన్షు. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకుంది. కానీ అనంతరం సడెన్‌గా సినిమాలకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయింది. మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యే సోషల్ మీడియాలో మళ్లీ కనిపిస్తోంది. రీసెంట్గా నాగ్‌ను కూడా కలిసింది. ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.
మళ్లీ ఇప్పుడు మరో ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తాను సినిమాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కారణాలను కూడా తెలిపింది. తాను ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ తన పూర్వీకులు భారతదేశానికి చెందిన వారని తెలిపింది అన్షు. తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని పేర్కొంది. అప్పుడే మన్మథుడు మూవీలో ఆఫర్ వచ్చిందని తెలిపింది. అలా కొన్ని చిత్రాలు చేసి మళ్ళీ అక్కడికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.