Kriti Sanon Networth :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 'వన్- నేనొక్కడినే', 'దోచెయ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఆమె, చివరగా ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో నటించి మెప్పించారు. ఇటీవలే నేషన్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే యాక్టింగ్, నిర్మాణ పనుల్లో బిజీగా గడుపుతున్నారు.
మనందరికీ ఓ నటిగానే తెలిసిన కృతి ఫ్యాషన్ రంగంలో మిస్ టేకెన్(Ms Taken), ఫిట్నెస్ రంగంలో ది ట్రైబ్(The Tribe), నిర్మాణ రంగంలో బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్ (Blue Butterfly Film)లతో పాటు సౌందర్య రంగంలో హైఫెన్(Hyphen) లాంటి ఇతర వ్యాపాల్లో రాణిస్తూ కోట్ల ఆదాయాన్ని గడిస్తున్నారట.
తాజాగా అందిన సమాచారం ప్రకారం కృతి సనన్ ముంబయిలోని ఓ డ్యూప్లెక్స్ ఇంటికి నెలకు రూ.10 లక్షలు అద్దె కడుతున్నారట. అంధేరీలోని అట్టాంటిస్ బిల్డింగ్‌లోని 27,28 అంతస్తుల్లో ఉండే ఈ విలువ దాదాపు రూ.31 కోట్లు విలువైందట. ఇందులో నివసించేందుకు ఆమె రూ. 60 లక్షలు డిపాజిట్ చేశారట.
కృతి ఇంటిని ప్రముఖ ఫేమస్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డెకరేటర్ అయిన ప్రియాంకా మెహ్రా డిజైన్ చేశారు. ఇంటి గోడలన్నింటిని లైట్ కలర్ ప్యాలెట్‌తో అందంగా రూపొందించారు. ప్రతి గదినీ ప్రత్యేకమైన థీమ్‌లతో చాలా ఆకర్షణీయంగా మార్చారు. వీటితో పాటు ఆధునిక ఫర్నీచర్, మాడ్యులర్ కిచెన్ ఏరియా, విశాలమైన గదులు, కిటికీలు రకరకాల పెద్ద పెద్ద మొక్కలతో డ్యూపెక్స్ ఇళ్లు మొత్తాన్ని చాలా బాగా అలంకరించి ఉంచారు. రోజంతా ఎంత అలసిపోయినా ఇంటికి వెళ్లగానే హాయిగా అనిపించేలా ఆమె ఇంటికి డిజైన్ చేయించుకున్నారు.
ఇంకో విషయం ఏంటంటే. ఆ ఇంట్లో కేవలం కృతి ఫొటోలు దిగటం కోసం ఓ ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేసుకున్నారట. అది నలుపు, తెలుపు రంగు పెయింటింగ్, కళాకృతులతో చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. అంత పెద్ద డ్యూప్లెక్స్ ఇంట్లో కృతితో పాటు ఆమె తల్లిదండ్రులు, చెల్లితో కలిసి ఉంటారు. వాళ్ళతో పాటు వారు ప్రేమగా పెంచుకునే డిస్కో, ఫోబె అనే రెండు పెంపుడు శునకాలు కూడా ఉంటాయట.
'ఆ సినిమా కోసం 17 గంటలు కష్టపడ్డాను'
'బన్నీతో నటించాలని ఉంది - ఎవరైనా మా ఇద్దరితో సినిమా తీస్తారా?'