తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్​ హీరోయిన్​ను పట్టేసిన రాకింగ్ స్టార్​ యశ్​! - Toxic Movie Heroine - TOXIC MOVIE HEROINE

Toxic Movie Heroine : టాక్సిక్​ సినిమాలో యశ్​ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్​ నటించనున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat and Getty Images
Ramcharan and Yash (Source ETV Bharat and Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 4:11 PM IST

Toxic Movie Heroine :కేజీయఫ్‌ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కన్నడ రాకింగ్​ స్టార్ హీరో యశ్​ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'​. 'ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌' అన్నది ఉపశీర్షిక. యశ్ 19గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రోజుకో వార్త బయటకు వస్తూ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది.

మొద‌ట ఈ చిత్రంలో యశ్​కు జోడీగా సాయిపల్లవి అని అన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ న‌టి కరీనా కపూర్‌ పేరు తెరపైకి రాగా రీసెంట్​గా హ్యూమా ఖురేషీ పేరు ప్రచారం సాగింది. ఇప్పుడు మరో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే సినిమాలో యశ్​ సరసన కియారా అద్వాణీ(Kiara Advani Toxic Movie) నటిస్తుందని అంటున్నారు. దాదాపుగా ఈమె కన్ఫామ్ అని చెబుతున్నారు.

Kiara Advani Upcoming Movies : కాగా, ఈ అందాల భామ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, హిందీలో ధోనీ బయోపిక్, కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్) వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్​లోనూ చేస్తోంది. ఇంకా ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 కోసం ఎంపికైంది. పెళ్లి తర్వాత ఇలా వరుసగా బడా ఆఫర్లను అందుకుంటున్న కియారా ఇప్పుడు టాక్సిక్​లోనూ నటించడం నిజమైతే ఆమెకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

ఇక టాక్సిక్ సినిమా విషయానికొస్తే కియారా అద్వాణీతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్​గా సిస్టర్ రోల్​లో నయనతార నటించనున్నట్లు తెలిసింది. అలాగే ఈ సినిమాను ముందుగా చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం చేయకుండా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్​ ప్రొడక్షన్స్​, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్నారు. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ కథ రాబోతుందంటూ గతంలో మూవీ టీమ్ తెలిపింది. మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించి బలమైన కథగా తయారు చేయడానికి గీతూ ఎంతో కష్టపడ్డారని పేర్కొంది.

యశ్‌ 'టాక్సిక్‌' షూటింగ్ అప్డేట్​ - మూవీ ఎన్ని భాగాలుగా రానుందంటే? - Yash 19 Toxic

1977లో అనౌన్స్​మెంట్​ 2024లో రిలీజ్​కు సిద్ధం - రూ.1000 కోట్ల బడ్జెట్​తో రానున్న సినిమా! - MEGALOPOLIS MOVIE

ABOUT THE AUTHOR

...view details