Katrina Kaif Merry Christmas Movie :బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తాజాగా 'మెర్రీ క్రిస్మస్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకించింది. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ అందుకుని థియేటర్లలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
'ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని- ఛాన్స్ వస్తే తప్పకుండా ఆ రోల్స్‌లో చేస్తాను' - కత్రినా కైఫ్ మెర్రీ క్రిస్మస్
Katrina Kaif Merry Christmas Movie : తన నటనతో అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది బీటౌన్ బ్యూటీ కత్రీనా కైఫ్. తాజాగా ఆమె 'మెర్రీ క్రిస్మస్' అనే సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రీనా తన మనసులోని మాట చెప్పింది.
Published : Jan 20, 2024, 9:57 PM IST
|Updated : Jan 24, 2024, 11:03 AM IST
" కాలానికి తగ్గట్టుగా మన టేస్ట్స్, థింకింగ్ మారుతుంటాయి. అందుకే నేను కేవలం హీరోయిన్‌గానే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ కనిపించాలని అనుకుంటున్నాను. ఇందులో భాగంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్, అలాగే పీరియాడిక్ సినిమాల్లో నటించాలని నాకు కోరికగా ఉంది. అలాంటి సినిమాలు నాలో ఉత్తేజాన్ని నింపుతాయి. మంచి పీరియాడిక్ స్టోరీ వస్తే నేను తప్పకుండా అందులో యాక్ట్ చేస్తాను. డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌కు నేను ఫ్యాన్‌ని. మెరీ క్రిస్మస్ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయటం నాకు సంతోషానిచ్చింది. ఆయన సినిమాల్లో హ్యూమర్‌తో పాటు హ్యూమన్ యాంగిల్ కూడా ఉంటుంది" అంటూ ఈ మూవీలో నటించిన అనుభవాన్ని తెలియజేసింది.
ఇక మెర్రీ క్రిస్మస్ సినిమా విషయానికి వస్తే - శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్‌లో నటించారు. వీరితో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ తమిళం, హిందీ భాషల్లో జనవరి 12న విడుదలైంది. అయితే మేరీ క్రిస్మస్ మూవీతోనే విజయ్ సేతుపతి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాల్సింది. ఆయన హిందీలో అంగీకరించిన ఫస్ట్ మూవీ ఇదే. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో మేరీ క్రిస్మస్ మూడో సినిమాగా రిలీజైంది. ఈ ఏడాది ముంబైకర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు విజయ సేతుపతి.