తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బుజ్జి కోసం 'కల్కి' మేకర్స్ స్పెషల్ ఈవెంట్​ - ఎక్కడ జరగనుందంటే? - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE

Kalki 2898 AD Bujji Reveal : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' స్పెషల్ ఈవెంట్​కు సన్నాహాలు మొదలైంది. ఇందులో భాగంగా మేకర్స్ నేడు (మే 22)న బుజ్జిని రివీల్​ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇంతకీ ఆ వేడుక ఎక్కడంటే ?

Etv BharatKALKI 2898 AD MOVIE
KALKI 2898 AD MOVIE (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 7:42 AM IST

Kalki 2898 AD Bujji Reveal :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్​కు కౌంట్​డౌన్​ మొదలైనందను ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి కొత్త అప్​డేట్స్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన స్క్రాచ్ ఎపిసోడ్​ 4 అభిమానులకు బిగ్​ సర్​ప్రైజ్​గా నిలిచింది. ప్రభాస్ పెట్టిన ఇన్​స్టా స్టోరీ వల్ల ఈ ఎపిసోడ్​కు మరింత హైప్​ పెరిగింది. అందులో భాగంగా భైరవ (ప్రభాస్​) బెస్ట్​ఫ్రెండ్​ను మేకర్స్ పరిచయం చేశారు. కీర్తి సురేశ్​ వాయిస్​ ఓవర్ ఇచ్చిన ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్​గా సాగింది.

అందులో ఓ తల మాత్రమే ఉన్న రోబోను చూపించారు. దాని మిగతా బాడీ పార్ట్స్​ను తయారు చేసే ప్రాసెస్​నే ఆ గ్లింప్స్​లో చూపించారు. అయితే ఆఖరిలో ప్రభాస్ బుజ్జిని రివీల్ చేస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో సస్పెన్స్ పెట్టారు. బుజ్జీని త్వరలోనే చూపిస్తామని వెల్లడించారు.​ ఓ స్పెషల్ ఈవెంట్​లో రివీల్ చేస్తామని చెప్పారు.

ఇప్పుడు ఆ ఈవెంట్​ కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్​ సిటీలో నేడు (మే 22) జరగనున్న ఆ ఈవెంట్​కు మూవీ టీమ్​ రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. 'మీట్ అవర్​ బుజ్జి అండ్ భైరవ' అంటూ క్యాప్షన్​ జోడించారు. దీంతో ఫ్యాన్స్ 'బుజ్జిని చూసేందుకు వెయిట్ చేయలేం' , 'త్వరగా రివీల్ చేయండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే, ఇది భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన దిశా పటానీ హీరోయిన్​గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు బిగ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.

హమ్మయ్య భైరవుడి బుజ్జి ఎవరో తెలిసిపోయిందోచ్​ - ఆసక్తి రేకెత్తిస్తోన్న వీడియో - Kalki 2898 AD Movie

'కల్కి' మేకర్స్ ప్రమోషనల్​ స్ట్రాటజీ - ఈ సినిమాకు అక్కడ కూడా సూపర్ క్రేజ్! - PRABHAS KALKI 2898 AD Movie

ABOUT THE AUTHOR

...view details