Horror Comedy Movie Munjya OTT : కొన్ని చిత్రాలు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలా రీసెంట్గా వచ్చిన చిత్రం ముంజ్యా. 17 రోజుల్లోనే ఈ హారర్ కామెడీ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ విషయాన్ని మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. "ముంజ్యా నవ్విస్తూ, భయపెడుతూ రూ.100 కోట్లు సంపాదించింది. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు" అని ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ ఈ పోస్ట్ చేసింది టీమ్. అలానే కలెక్షన్ వివరాలను తెలిపింది.
ఈ చిత్రానికి రూ.103 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వచ్చినట్లు మూవీటీమ్ తెలిపింది. నెట్ కలెక్షన్లు రూ.87.35 కోట్లు వచ్చాయి. మొదటి రోజు అనూహ్యంగా రూ.4 కోట్ల ఓపెనింగ్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం తొలి వారమే రూ.36.5 కోట్లతో అదరగొట్టింది. అదే జోరును కొనసాగిస్తూ రెండో వారం మరో రూ.32 కోట్లు అందుకోగా, మూడో వారం కూడా మంచి వసూళ్లనే అందుకుంది.
ముంజ్యా మూవీ కథేంటంటే? -ముంజ్యా చిత్రాన్ని మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించారు. చిత్రంలో శర్వరీ వాఘ్, మోనా సింగ్, అభయ్ వర్మ, సత్యరాజ్ లాంటి వాళ్లు నటించారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో జరిగిన కథగా దీనిని తెరకెక్కించారు. ముంజ్యా అనేది ఓ వింత జీవి. అది బిట్టూ (అభయ్ వర్మ) జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించిందనేదే ఈ కథ.