Ramcharan Daughter Photo:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు గతేడాది పాప జన్మించిన సంగతి తెలిసిందే. పాపకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు అయినా పాప ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే నేడు ( మార్చి 27న) రామ్ చరణ్ 37వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రామ్ చరణ్ దంపతులు తమ ముద్దుల కూతురు క్లింకారను కూడా తీసుకువెళ్లారు.
క్లింకార పుట్టి దాదాపు 10 నెలలు అవుతున్నా మీడియాకు తనని ఒక్కసారి కూడా చూపించలేదు ఈ జంట. కానీ ఈరోజు ఉపాసన చేతిలో ఉన్న క్లింకార ముఖం కెమెరా వైపు ఉండటం వల్ల ఆ చిన్నారి ముఖం కెమెరాకు చిక్కింది. పట్టు పంచెలో రామ్ చరణ్ సంప్రదాయ వస్త్ర ధారణలో ఉపాసన శ్రీవారిని దర్శించుకున్నారు. అభిమానులు వాళ్ళిద్దరిని చూసి క్యూ లైన్ లోనే రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు.
ఉపాసన చేతిలో ఉన్న క్లింకార కొంచెం కనిపించగానే చరణ్ ఉపాసన ను ముందుకు వెళ్ళమని సైగ చేశారు. దర్శనం తర్వాత భద్రతా సిబ్బంది సహాయంతో కార్లో కూర్చున్నారు ఈ మెగా దంపతులు. అంతే ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో క్లింకార కళ్ల గురించి చర్చ నడుస్తోంది. అభిమానులు ఆ కళ్లు అచ్చం రామ్చరణ్విలా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.