Gunturu Karam Trivikram Mahesh Babu :భారీ అంచనాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఎందుకంటే ఎప్పుడూ తన సినిమాల్లో కథపై పూర్తి పట్టును ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ ఎమోషన్స్, పదునైన మాటలతో మేజిక్ చేసే దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రంలో అలా చేయలేకపోయారు. దీంతో సినిమా రిజల్ట్ విషయంలో డివైడ్ టాక్ వచ్చింది. అయితే వాస్తవానికి 'గుంటూరు కారం' కోసం మొదటగా రాసుకున్న స్టోరీ ఇది కాదని తెలిసింది.
త్రివిక్రమ్ మహేశ్ బాబుతో కలిసి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయాలని అనుకున్నారట. దాన్నే అనౌన్స్ చేసిందట. కానీ కొద్ది రోజుల తర్వాత మహేశ్ బాబు మనసు మారిందని తెలిసింది. ఎందుకంటే ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో చేసేది కూడా యాక్షన్ మూవీనే అవ్వడం వల్ల మహేశ్ తన మనసును మార్చుకున్నారట. అందుకే యాక్షన్‌కు ముందు ఫ్యామిలీ ఎంటర్ టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని మాటల మాంత్రికుడితో చెప్పారట.
ఇక చేసేదేమి లేక త్రివిక్రమ్ తన స్టోరీని మార్చుకున్నారట. కానీ అప్పటికే సంక్రాంతి రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు. దీంతో మాటల మాంత్రికుడు త్వరత్వరగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త కథను సిద్ధం చేసి షూటింగ్‌ను పూర్తి చేశారు. గుంటూరు కారంగా థియేటర్లలోకి వదిలారు. అందుకే షూటింగ్ వాయిదాలు, టెక్నీషియన్స్ మారడాలు జరిగాయని తెలిసింది. అందుకే ఫైనల్‌గా 'గుంటూరు కారం' కొత్త కథ ఔట్ పుట్ సరిగ్గా రాలేదట.