Devara Special Shows :గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'దేవర' మూవీ సెప్టెంబరు 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోస్, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. మరి షోలు ఎప్పుడు పడనున్నాయి? టికెట్ ధరలు ఎంత పెరగనున్నాయంటే?
29 థియేటర్లలో సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 27న అర్ధరాత్రి 1 గంట స్పెషల్ షో పడనుంది. ఇక అన్ని థియేటర్లలో తొలి రోజు 6 షో లు (4 గంటల నుంచి ప్రారంభం) ప్రదర్శించేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ. 100 పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా, అటు ఏపీలోనూ స్పెషల్ షోలు, టికెట్ ధర పెంపునకు కూడా అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే!
నైజాం ఏరియాలో 'దేవర' టికెట్లు రూ.45 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను అందుకున్నాయి.ఈ క్రమంలో ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సుమారు రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.