Bigg Boss 8 Starting Date :బిగ్‍బాస్.. ఈ పేరు వింటేనే చాలా మందికి ఎక్కడలేని హుషారు వస్తుంది. కారణం.. అద్భుతమైన టాస్క్‌లు.. ఆసక్తి రేకెత్తించే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎలిమినేషన్లు.. ఇలా ఒక్కటేమిటి 100 రోజులకు పైగా మస్తు ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. అందుకే ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా.. సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్, ప్రోమో రిలీజ్ కావడంతో.. అసలు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓపెనింగ్ డేట్ అనౌన్స్ అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొదటి ప్రోమో ఇలా.. బిగ్‍బాస్ సీజన్ 7 ఫైనల్ రోజు జరిగిన రచ్చతో.. ఇకమీదట ఈ షో ఉండదనే రూమర్స్ ఎన్నో వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బిగ్‍బాస్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్, ప్రోమో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ప్రోమోలో నాగార్జున, కమెడియన్ సత్య సందడి చేశారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అంటూ.. షోపై మరింత ఆసక్తిని పెంచేశారు. సత్యను ఒంటరిగా ఎడారిలోకి పంపడంతో.. బిగ్‍బాస్ 8వ సీజన్‍లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా అనే అంచనాలు మొదలయ్యాయి.
బిగ్‍బాస్ 8 : ఈ సీజన్‍లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా? - లిస్ట్ మామూలుగా లేదు! -
రెండు హౌజ్‌లు?: సాధారణంగా బిగ్‍బాస్ హౌజ్ అంటే.. ఒకటే ఇంట్లో సెలబ్రిటీలందరినీ పెట్టి వారితో గేమ్ ఆడిస్తుంటారు మేకర్స్. అయితే.. సీజన్ 8ని కొత్తగా చూపించే క్రమంలో.. ఈ సీజన్‍లో రెండు హౌజ్‌లు ఉంటాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ కొద్దిమంది సెలబ్రిటీలను రెండో హౌజ్‌లో ఉంచి.. షో చివర్లో వారిని మొదటి ఇంట్లోకి పంపిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.