తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్! - naga manikanta marriage video - NAGA MANIKANTA MARRIAGE VIDEO

Bigg Boss 8 Naga Manikanta Marriage Video : తనను భార్య వదిలేసిందంటూ చెప్పి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న నాగమణికంఠ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. అతని భార్య ఎవరో మీరూ చూసేయండి..

Naga Manikanta Marriage Video
Naga Manikanta Marriage Video (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 1:58 PM IST

Bigg Boss 8 Naga Manikanta Marriage Video : బిగ్ బాస్​ 8వ సీజన్లో చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. తొలి రోజు నుంచే హీట్ పెంచేసిన షో.. ఆ తర్వాత నుంచి హాట్ హాట్ గానే సాగింది. పలువురు హౌస్​ మేట్స్ రచ్చ రచ్చ చేశారు. మాటల తూటాలు పేల్చారు. ఈ క్రమంలో.. నామినేషన్స్​ వాడీ వేడిగా సాగాయి. ఫస్ట్ వీక్​లో మొత్తం ఆరుగురు నామినేట్​ అయ్యారు. వారిలో.. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్​, శేఖర్​ బాషా, బేబక్క, నాగమణికంఠ ఉన్నారు. దీంతో.. వీరిలో ఎవరు హౌస్​ నుంచి బయటకు వెళ్లిపోతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

సాధారణంగా బిగ్​బాస్​ నామినేషన్స్​ సోమవారం రోజున స్టార్ట్​ అవుతాయి. కానీ.. ప్రస్తుత సీజన్​లో మాత్రం మంగళవారం మొదలై.. బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు ఈ నామినేషన్స్​ కొనసాగాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు పాటు ఓటింగ్స్​ జరిగాయి.

నామినేట్ అయిన కంటెస్టెంట్స్​లో ఇద్దరి మధ్య ఫైట్​ ఉన్నట్టుగా అన్​అఫీషియల్ పోల్స్ చెబుతున్నాయి. "సింపతీ స్టార్స్" అంటూ ట్రోల్​ అవుతున్న నాగ మణికంఠ, విష్ణుప్రియకు ఓట్లు భారీగా పోల్ అవుతున్నాయనే టాక్ నడుస్తోంది. కొన్ని పోల్స్​లో విష్ణుప్రియ.. మరికొన్ని పోల్స్​లో నాగమణికంఠ టాప్​లో ఉన్నట్టు సమాచారం. ఇలా చూసుకుంటే.. వీరిద్దరూ ఎలిమేనేషన్​ నుంచి బయట పడతారని బలంగా టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి టైమ్​లోనే నాగమణి కంఠకు సంబంధించిన పెళ్లివీడియో సోషల్ మీడియాలో విడుదల కావడం విశేషం. ఎలాంటి అంచనాలూ లేకుండా బిగ్​బాస్​ హౌస్‌లోకి అడుగుపెట్టిన మణికంఠ.. తన ఇంట్రో వీడియోలో చెప్పుకున్న కష్టాలతో సింపథీ గెయిన్ చేశాడు. తల్లీతండ్రీ లేరని, భార్య వదిలేసిందని, తాను ఒంటరినంటూ చెప్పుకోవడం ద్వారా.. సానుభూతి పాయింట్లు కొట్టేశాడు. ఈ విషయమై హౌస్​లో మాటల యుద్ధం కూడా నడిచింది. నామినేషన్స్​లో మిగిలిన వాళ్లంతా టార్గెట్ చేయడంతో.. అనూహ్యంగా మణికంఠ టాప్ రేస్‌లోకి వచ్చాడు.

అయితే.. తనను భార్య వదిలేసిందని చెప్పడంతో ఆమె ఎవరా అంటూ జనాలు నెట్​లో బాగానే సెర్చ్ చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. మణికంఠ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఆమె ఫొటోలు కనిపించలేదు. ఇలాంటి టైమ్​లో ఇన్‌స్టాగ్రామ్‌లో మణికంఠ పెళ్లి వీడియో రిలీజ్​ కావడంతో.. ఒక్కసారిగా వైరల్ అయ్యింది. సరిగ్గా నామినేషన్స్ టైమ్​లో ఈ వీడియో విడుదల కావడం విశేషం. ఈ వీడియో చూసిన వారంతా.. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. మరి.. మణికంఠ భార్య ప్రియ ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలంటే.. ఈ వీడియోపై ఓ లుక్ వేయండి.

ABOUT THE AUTHOR

...view details