Balakrishna Prabhas Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారిపోయారు. అయితే తాజాగా బాలయ్య బాబు ఓ భారీ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. అది కూడా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి స్క్రీన్‌మీద కనిపించున్నారని తెలుస్తోంది. అదే మంచు విష్ణు డీమ్ర్ ప్రాజెక్టు 'కన్నప్ప' చిత్రం.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'కన్నప్ప' చిత్రంలో ఇప్పటికే ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. మూవీ మేకర్స్ ఇప్పటికే బాలకృష్ణతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. మరి బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో ఇంక క్లారిటీ లేదు. ఒకవేళ ఈ సినిమాకు బాలకృష్ణ ఓకే అంటే మాత్రం ఇదే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా కానుంది.
Manchu Vishnu Kannappa Movie :ఇక సినిమా విషయానికొస్తే మోడల్, క్లాసిక్ డ్యాన్సర్, భరత నాట్యంలో ప్రావీణ్యురాలైన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, కలెక్షన్ మోహన్‌బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ నటిస్తున్నారు. రీసెంట్గా న్యూజిలాండ్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని మూవీ టీమ్ భారత్‌కు తిరిగి వచ్చింది. ఇప్పటికే కన్నప్ప చీత్రీకరణ 60శాతం వరకు కంప్లీట్ అయింది.