Anasuya Bharadwaj Vacation Pics Viral : టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఈమె ఒకరు. ఈ మధ్య బుల్లితెరకు కాస్త దూరంగా ఉంటూ వరుస సినిమాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అవుతోంది. రీసెంట్‌గానే తన ఫ్యామిలీతో కలిసి ఓ వెకేషన్ ట్రిప్‌కు వెళ్లింది. సిక్కింలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ భర్త, పిల్లలతో కలిసి జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఫుల్ చిల్ కొడుతోంది. దీనికి సంబందించిన ఫొటోస్ను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సారి లేటెస్ట్ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
"మరో రోజు. మరో ట్రెక్. మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి" అంటూ అనసూయ తన పిక్స్‌తో పాటు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పిక్స్‌లో భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి వాటర్ ఫాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది అనసూయ. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు అనసూయ చాలా హాట్ హాట్‌గా ఉన్నారు. పొట్టి డ్రెస్‌లో అను అందాలను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.