Golden Globe Awards :పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రేసులో నిరాశే ఎదురైంది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలోని బెస్ట్ మోషన్ పిక్చర్ విభాగంలో ఈ సినిమా పోటీ పడినా, చివరకు ఆ పురస్కారం మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన సినిమా ‘ఎమీలియా పెరెజ్’కు దక్కింది.
- ఎమీలియా పెరెజ్ సినిమాలో యాక్ట్ చేసిన నటి జో సల్దానాకు బెస్ట్ సపోర్టింగ్ నటిగా పురస్కారం దక్కింది.
- బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరీలో పోటీపడిన సినిమాల జాబితాలో ‘ది గర్ల్ విత్ ది నీడిల్’ (పోలండ్), ‘ఐయామ్ స్టిల్ హియర్’ (బ్రెజిల్), ‘ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్’ (జర్మనీ), వెర్మిగ్లియో (ఇటలీ) ఉన్నాయి.
పాయల్ కపాడియాకు నిరాశే!
- గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘బెస్ట్ డైరెక్షన్’ కేటగిరీలోనూ పాయల్ కపాడియా పేరు నామినేట్ అయింది. అయితే అందులోనూ ఆమెకు భంగపాటే ఎదురైంది.
- ‘ది బ్రూటలిస్ట్’ సినిమాకు డైరెక్టరుగా వ్యవహరించిన బ్రాడీ కార్బెట్‌ను ‘బెస్ట్ డైరెక్షన్’ పురస్కారం వరించింది. ఈ కేటగిరీలో పోటీపడిన దర్శకుల జాబితాలో జాక్వెస్ ఆడియార్డ్ (ఎమీలియా పెరెజ్), సీన్ బేకర్ (అనోరా), ఎడ్వర్డ్ బెర్జర్ (కాంక్లేవ్), కోరాలీ ఫార్గీట్ (ది సబ్ స్టాన్స్) ఉన్నారు.