తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్త ప్రేమలో అలియా భట్​ - రహస్యాల వేటలో కరీనా - Bollywood Latest Updates - BOLLYWOOD LATEST UPDATES

Alia Bhatt Love And War Movie shooting : బాలీవుడ్​కు సంబంధించి కొత్త సినిమా అప్డేట్స్​ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో రణ్​బీర్ కపూర్​, అలియా భట్, కరీనా కపూర్, అక్షయ్​ కుమార్​, అజయ్ దేవగణ్, నవాజుద్దీన్​ నటిస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్​ ఉన్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat and ANI
alia bhatt, Kareena kapoor (source ETV Bharat and ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 7:06 AM IST

Alia Bhatt Love And War Movie shooting :బాలీవుడ్ భామ అలియా భట్​ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే 'ఆల్ఫా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే లవ్‌ అండ్‌ వార్‌ అనే చిత్రాన్ని చేయనుంది. ఈ సినిమా మరి కొద్దిరోజుల్లోనే సెట్స్​పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్​ అక్టోబర్​లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నవంబరులో 'ఆల్ఫా' షూటింగ్‌ను పూర్తి చేసి డిసెంబరులో ఈ కొత్త మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టనుందట అలియా. సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Ajay Devgn Desi Indiana Jones : ఇప్పటి వరకు ప్రేమ కథలు, యాక్షన్‌ మూవీస్​తో ప్రేక్షకులను మెప్పించిన అజయ్‌ దేవగణ్‌ ఈ సారి మునుపెన్నడూ పోషించని ఓ సరికొత్త పాత్రతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఇప్పుడు యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం అందింది. జగన్‌ శక్తి దర్శకుడు. 'ఇండియానా జోన్స్‌' సిరీస్‌ తరహాలో దీన్ని రూపొందిస్తున్నారట. ఇందులో అజయ్‌ ఓ ధైర్యవంతుడైన ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నారని తెలిసింది. లవ్‌రంజన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. షూటింగ్​ డిసెంబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం అజయ్​ 'దే దే ప్యార్‌ దే 2', 'రైడ్‌ 2', 'సింగమ్‌ అగైన్‌' సహా పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Kareena Kapoor The Buckingham Murders : బాలీవుడ్‌ హీరోయిన్​ కరీనా కపూర్‌ డిటెక్టివ్‌గా మారింది. ఓ హత్య కేసుకు సంబంధించి హంతకులను పట్టుకోవడంలో నిమగ్నమైంది. మరి ఈ భామ ఈ కేసును చేధించిందా? లేదా అనేది తెలియాలంటే 'ది బకింగ్‌ హామ్‌ మర్డర్స్‌' చూడాల్సిందే. ఆమె మెయిన్​ రోల్​లో నటిస్తున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్​కు హన్సల్‌ మెహతా దర్శకుడు. రీసెంట్​గా రిలీజైన టీజర్‌ మూవీ లవర్స్​ను బాగా ఆకట్టుకుంది. డిటెక్టివ్‌ జస్మిత్‌ భమ్రా రహస్యాలను బయట పెట్టే మార్గంలో ఉంది అంటూ తాజాగా విడుదలైన పోస్టర్​ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి కరీనా కపూర్‌. శోభా కపూర్, ఏక్తా కపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది.

Akshay Kumar Sky Force PostPone : బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్​ కపూర్​​ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'స్కై ఫోర్స్‌'. "ఎవరైనా మన దేశాన్ని అణిచివేయాలనుకున్నా, లొంగదీసుకోవాలని ప్రయత్నించినా, హిందూస్థాన్​ మౌనంగా ఉండదు" అంటూ అక్షయ్​ కుమార్​ ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేశారు. సందీప్‌ కెవ్లానీ, అభిషేక్‌ కపూర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సారా అలీఖాన్, నిమ్రత్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబరు 2న ఇది రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడీ మూవీ రిలీజ్​ ఆలస్యం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

Nawazuddin Siddiqui Adbhut OTT : బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అద్భుత్‌. సబ్బీర్‌ ఖాన్‌ దర్శకుడు. శ్రేయా ధన్వంతరి, డయానా పెంటీ, రోహన్‌ మెహ్రా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంది. "నమ్మకాన్ని మించినదే నిజం" అనే క్యాప్షన్​తో రిలీజ్​ చేసింది. ఇందులో ఓ రహాస్యాన్ని చేధించే డిటెక్టివ్‌ పాత్రలో నవాజుద్దీన్​ కనిపించనున్నారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వచ్చే నెల 15న ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నారు.

'తంగలాన్'​ దర్శకుడితో సూర్య - పొల్లాచ్చిలో వెంకీ పాట - Thangalan Director Suriya Movie

టాలీవుడ్​కు కొత్త అందాలు - నందమూరి వారసుల కోసం ఇద్దరు భామలు - Tollywood Upcoming New Heroines

ABOUT THE AUTHOR

...view details