Nayanthara Controversy :లేడీ సూపర్ స్టార్ నయనతార- హీరో ధనుశ్ మధ్య కాంట్రవర్సీ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది. నయన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుశ్ తీరును ఆమె తప్పుబట్టారు. దీంతో ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నయన్ సోషల్ మీడియా లేటెస్ట్ పోస్ట్ వైరల్‌గా మారింది.
కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి నయన్ ఓ పోస్ట్‌ను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. 'అబద్ధాలతో ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తే, దాన్ని మీరు ఒక అప్పులాగా భావించండి. ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి' అనేది ఆమె పోస్ట్ సారాంశం. అయితే ఆమె ఉన్నట్టుండి ఈ పోస్ట్ ఎందుకు షేర్ చేశారో మాత్రం తెలియదు.
అందుకేనా?
'నానుమ్ రౌడీ దాన్' సినిమాకు సంబంధించి 3 సెకన్ల వీడియో క్లిప్‌ను డాక్యుమెంటరీ ట్రైలర్లో చూపించినందుకు ఆ చిత్ర నిర్మాత ధనుశ్ రూ.10 కోట్లు నష్ట పరిహారంగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయన్ దంపతులకు ఆయన లీగల్ నోటీసులు కూడా పంపించారు. అలాగే ఈ విషయంపై ధనుశ్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నయన్ - విఘ్నేశ్ దంపతులపై దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే నయన్ పరోక్షంగా ధనుశ్‌ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు.