తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అండర్ ​రేటెడ్​గా వచ్చి ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు ఇవే! - 5 BEST NETFLIX FILMS

క్రైమ్, కామెడీ మూవీస్ కావాలా? అయితే నెట్ ఫ్లిక్స్​లో ఈ 5సినిమాలు చూసేయండి!

Netflix Top Movies
5 best Netflix films (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 2:53 PM IST

5 Best Netflix Films : ప్రముఖ ఓటీటీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ వీక్షకులకు ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లను అందించడంలో ముందుంటుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్స్ మూవీస్ ను ప్రేక్షకుల కోసం తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ లో మీరు చూసేందుకు అందుబాటులో ఉన్న టాప్-5 అండర్ రేటెడ్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం పదండి.

1. కథల్ : జాక్​ఫ్రూట్ మిస్టరీ
కథల్ మూవీలో సన్యా మల్హోత్రా, జోషి అనంత్విజయ్, విజయ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని కామెడీ, క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ మేళవింపుగా తెరకెక్కించారు డైరెక్టర్ యశోవర్ధన్ మిశ్ర. ఈ సినిమాలో ఓ స్థానిక రాజకీయ నాయకుడికి చెందిన పనసకాయలు దొంగతనానికి గురవుతాయి. దీని చుట్టూ కామెడీని పండిస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దారు. అలాగే చట్టంపై రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ ప్రభావాన్ని చక్కగా చూపించారు. 2023లో నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్​ను సొంతం చేసుకుంది.

2. భక్షక్
హీరోయిన్ భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'భక్షక్‌'. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై షారుక్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ సినిమాను నిర్మించారు. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్‌ వైశాలీ సింగ్‌ పాత్రలో భూమి పెడ్నేకర్‌ ఆకట్టుకున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించింది? ఆధారాలతో వాటిని ఎలా బయటపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? అనేదే ఈ కథ. ఈ మూవీ 2024 ఫిబ్రవరిలో నెట్​ఫ్లిక్​లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

3. చాప్ స్టిక్స్
'చాప్ స్టిక్స్' సినిమా కామెడీ డ్రామాగా తెరకెక్కింది. సచిన్ యార్డీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ముంబయి బ్యాక్ డ్రాప్​లో ఈ మూవీ రూపొందింది. అభయ్ డియోల్​తో పాటు మిథిలా పాల్కర్, విజయ్ రాజ్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. తన కారును పోగొట్టుకున్న అభయ్ డియోల్ దాన్ని పొందే క్రమంలో జరిగే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 2019లో ఈ మూవీ నెట్​ఫ్లిక్స్​లోకి వచ్చి అదరగొట్టింది.

4. మీనాక్షి సుందరేశ్వర్
వివేక్ సోనీ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా మూవీ 'మీనాక్షి సుందరేశ్వర్'. పెళ్లై ఎడబాటులో ఉన్న జంటల అభద్రతాభావాలు, గొడవలు, లోపాలు, సంఘర్షణను దర్శకుడు చక్కగా ఫోకస్ చేశారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన అభిమన్యు దస్సాని సుందరేశ్వర్ పాత్రలో ఒదిగిపోయారు. మీనాక్షి పాత్రలో సన్యా మల్హోత్రా అదరగొట్టింది. ఈ మూవీ 2021లో ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో విడుదలవ్వగా మంచి విజయం సాధించింది.

5. మార్గరీటా విత్ ఏ స్ట్రా
మార్గరీటా విత్ ఏ స్ట్రాను సోనాలి బోస్ తెరకెక్కించారు. ఇందులో కల్కి కోచ్లిన్, సయానీ గుప్తా, రేవతి కీలక పాత్రలు పోషించారు. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న ఒక యువతిపై చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆమె రోజువారీ సవాళ్లు, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీ నెట్​ఫ్లిక్స్​లో 2015లో రిలీజ్ అయ్యి, మంచి విజయాన్ని అందుకుంది.

ఒక్క సీన్ కోసం రూ.25 కోట్లు ఖర్చు!- ఆ సినిమా ఏదో తెలుసా? - The Most Expensive Movie Scene

21 ఏళ్లకే 75 మూవీలకు సైన్‌ - 100 ఆటోలు, 100 లారీలు కొనాలనే ప్లాన్‌! - ఈ బీటౌన్​ స్టార్ సక్సెస్ జర్నీ ఇదే!

ABOUT THE AUTHOR

...view details