Tips to Overcome Stage Fear:చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుతారు. తమ స్కిల్స్, వాక్చాతుర్యంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ స్టేజ్ ఎక్కి నలుగురి ముందు మాట్లాడమంటే మాత్రం వాళ్ల సౌండ్ బాక్స్ మ్యూట్ అవుతుంది. ఆ భయాన్ని ఎంత వదిలించుకుందామన్నా అది మాత్రం పోదు. కానీ ఏదో ఒక సమయంలో నలుగురి ముందుకు వెళ్లి మాట్లాడవసిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో చాలా మందికి స్టేజ్ ఎక్కేసరికి కాళ్లు, చేతులు షివర్ అవుతాయి. ఒళ్లంతా చల్లబడిపోతుంది.. మాట్లాడాలనుకున్నప్పుడు తడబడతారు. మంచి నాలెడ్జి ఉంటుంది. కానీ స్టేజి ఫియర్ వలన దానిని వ్యక్తపరచలేరు. దీని వల్ల గొప్ప అవకాశాలను కూడా కోల్పేయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే పుట్టుకతోనే ఎవరూ కూడా గొప్ప ఉపన్యాసకులుగా పుట్టరు. వాళ్లని వాళ్లు గొప్ప వక్తలుగా మలుచుకుంటారు. మొదట్లో ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించాలి. మరి అలా చేయాలంటే ఈ టిప్స్ పాటించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
How to Overcome Stage Fright:
- స్టేజ్ ఫియర్ పొగొట్టుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. టెన్షన్ పడకుండా.. నేను ఎలాగైనా మాట్లాడతా.. అందరి ప్రశంసలు అందుకుంటా అంటూ మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. పరిస్థితి ఏదైనా సరే స్టేజ్ ఎక్కి మాట్లాడే విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముందుగానే రెడీగా ఉండటం వల్ల సగానికి సగం భయం తగ్గిపోతుందని అంటున్నారు.
- ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ అంశం గురించి మీకు పూర్తిగా తెలిసుండాలి. చెప్పే విషయం మీద మీకు మంచి పట్టు ఉన్నప్పుడు భయం అనేది ఆటోమేటిక్‌గా మీ నుంచి పోతుంది. ఒకవేళ మీరు మాట్లాడే విషయమై మిమ్మల్ని మధ్యలో ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అలా ఉండాలంటే చెప్పబోయే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి.
- మీకు టాపిక్ మీద ఎంత మంచి అవగాహన ఉన్నా.. ప్రాక్టీస్ కచ్చితంగా అవసరం. అందుకే అంటారు.. Practice Makes a Man Perfect. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడేముందు ఇంట్లో అద్దం ముందు నిలబడి మీరు ఇవ్వబోయే స్పీచ్‌ని ప్రాక్టీస్ చేయండి. లేదా మీ మొబైల్‌తో రికార్డు చేసి తరువాత చూసుకోండి. దీని వల్ల మనం చేసే తప్పులేంటో మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు.
- స్టేజ్ మీద మాట్లాడుతున్నంత సేపు కూడా మీ ఫోకస్, మీ ఎయిమ్ అంతా మీరు చెబుతున్న టాపిక్ మీదే ఉండాలి. మీ దృష్టి కొంచెం మళ్లిందా.. మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. స్పీచ్ ఎక్కడ ఆపారో గుర్తుండదు. తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి మీకు స్పీచ్ మధ్యలో ఎటువంటి డిస్ట్రబెన్స్ కలగకుండా చూసుకోండి.