UPSC Recruitment 2024 :యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేటగిరీ - పోస్టులు
UPSC Nursing Officer Jobs 2024 :
- యూఆర్ - 892 పోస్టులు
- ఓబీసీ - 446 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 193 పోస్టులు
- ఎస్టీ - 164 పోస్టులు
- ఎస్సీ - 235 పోస్టులు
- మొత్తం పోస్టులు - 1930
విద్యార్హతలు
UPSC Nursing Officer Job Qualifications :అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. లేదా జీఎన్ఎం కోర్సుతోపాటు కనీసం ఒక ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి
UPSC Nursing Officer Job Age Limit :అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు - 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఆయా కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
UPSC Nursing Officer Job Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు పరీక్ష ఫీజు కట్టాల్సిన పనిలేదు.
ఎంపిక ప్రక్రియ
UPSC Nursing Officer Job Selection Process :అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా సెలక్ట్ అయిన అభ్యర్థులు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
UPSC Nursing Officer Job Apply Process :
- అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ ఓపెన్ చేయాలి.
- పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
UPSC Nursing Officer Job Apply Last Date :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేదీ : 2024 మార్చి 7
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మార్చి 27
- కరెక్షన్కు ఛాన్స్ : 2024 మార్చి 28 నుంచి ఏప్రిల్ 3
అగ్నివీర్ రిక్రూట్మెంట్లో 4 కీలక మార్పులు - మహిళలకు ప్రత్యేక అవకాశాలు!
NALCOలో 277 ఇంజినీరింగ్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!