Tips To Improve Your Concentration Skills:కొద్దిమంది విద్యార్థులు గంటల తరబడి చదువుతారు.. అయినా చదివింది ఏమాత్రం బుర్రకెక్కదు. దీంతో తమలో తామే బాధపడుతుంటారు. అయితే ఇలా చదివిన అంశాలు మర్చిపోవడానికి ప్రధాన కారణం ఏకాగ్రత లోపించడమే అని నిపుణులంటున్నారు.ఏకాగ్రతలోపించడం వల్ల తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా వస్తాయంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని టిప్స్ పాటించడం వల్ల విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సోషల్ మీడియాకు దూరంగా :ఈ రోజుల్లో ఆన్‌లైన్ క్లాసులు, కొన్ని రకాల స్టడీ మెటీరియల్స్ కోసం విద్యార్థులు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, అవసరం ఉన్న సమయంలోనే మొబైల్ ఫోన్ ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. సాయంత్రం స్కూల్‌నుంచి ఇంటికి రాగానే.. ఫోన్‌లో ఎక్కువ సేపు గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాను వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. కాబట్టి ఫోన్లను అవసరం మేరకే ఉపయోగించాలని చెబుతున్నారు.
స్పష్టత ఉండాలి : విద్యార్థులకు స్కూల్‌లో టీచర్స్ చెప్పిన పాఠాలు, చేయాల్సిన హోమ్‌వర్క్ వంటివి చాలా పనులుంటాయి. అన్నింటిని త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటుంటారు కొంత మంది పిల్లలు. దీనివల్ల ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేరు. కాబట్టి, మొదట ఏ పని చేయాలి ? తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి ? అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసే పనిపై స్పష్టత ఉండటం వల్ల ఏకాగ్రతతో ఆ వర్క్‌ను పూర్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రణాళిక ఉండాలి :పరీక్షల సమయంలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని సబ్జెక్టులు చదవడానికి తక్కువ సమయం పడుతుంది. ఇలా ఈజీగా ఉండే సబ్జెక్టులను మొదటగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. తర్వాత కొద్దిగా కష్టంగా ఉండే వాటిని చదవేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అంటున్నారు. ఒక టైమ్‌టేబుల్‌ను వేసుకుని దాని ప్రకారం అన్ని సబ్జెక్టులు చదువుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవని అంటున్నారు.
రాసుకుంటే మంచిది :విద్యార్థులు చదివేటప్పుడు.. కొన్ని అర్థం కానీ విషయాలను ఒక బుక్‌పై రాసుకుని చదవడం వల్ల చదివింది ఎక్కువగా గుర్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇక నుంచి పుస్తకం పట్టినప్పుడు ఒక బుక్ పక్కన పెట్టుకోండి.