How to Develop Soft Skills: టీమ్ మేట్స్‌తో కలిసి పని చేయడం.. కమ్యునికేషన్ చక్కగా ఉండడం.. టైమ్ మేనేజ్ మెంట్.. ప్రాబ్లమ్ సాల్వింగ్ తోపాటు స్ట్రెస్ మేనేజ్ మెంట్.. డెసిషన్ మేకింగ్.. వంటివన్నీ సాఫ్ట్ స్కిల్స్‌లో భాగమే. వ్యాపారాలు నిర్వహించే వారు కస్టమర్లతో ఎఫెక్టివ్‌గా మాట్లాడాలి. ఉద్యోగస్తులు బాస్‌లతో.. తమ పనితీరు గురించి క్లియర్‌గా వివరించాల్సి ఉంటుంది. మీ టీమ్‌ను నడిపించే లీడర్ షిప్ క్వాలిటీస్ మీకు చాలా అవసరం. ఈ నైపుణ్యాలు అన్ని రకాల ఉద్యోగాలు, కెరీర్లకూ ముఖ్యమే. అందుకే.. సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యంగా మారాయి. మరి, వీటిని ఎలా అందిపుచ్చుకోవాలి? అంటే.. ఇందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి.
టార్గెట్ అర్థం చేసుకోవడం:సాఫ్ట్ స్కిల్స్‌లో అత్యంత ముఖ్యమైనది కమ్యూనికేషన్. ఇతరులతో మాట్లాడేముందు వారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా దానికి అనుగుణంగా వారితో మాట్లాడాలి. అలాగని మనకు నచ్చిన భాషలో మాట్లాడటం చేయకూడదు.
ఐ కాంటాక్ట్:ఈ సాఫ్ట్ స్కిల్స్‌లో ఇంపార్టెంట్ అయినది ఐ-కాంటాక్ట్. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారితో ఐ-కాంటాక్ట్ మెయింటెన్ చేయాలి. అప్పుడు మీరు చెప్పాలనుకున్నది లేదా మాట్లాడాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పగలుగుతారు.
దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
మాట్లాడటం ప్రాక్టీస్: మీరు కాన్ఫిడెంట్ స్పీకర్ కాకపోతే.. ప్రాక్టీస్ చేయడం కంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. పబ్లిక్ స్పీకింగ్ మీకు కష్టంగా అనిపించినా.. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పటికీ మీకు కంఫర్ట్ లేకపోతే.. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలతో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి.
రైటింగ్ స్కిల్స్: కేవలం స్పీచ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మీ రైటింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం కూడా ముఖ్యం. మాట్లాడటం ప్రాక్టీస్ చేసినట్లే.. మీరు మీ రైటింగ్‌ను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది మరింత సులభంగా, అందంగా వస్తుంది. అయితే.. మీరు మీ సొంతంగా రాయడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే కమ్యూనిటీ సెంటర్లు, ఆన్లైన్లో కూడా వివిధ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. అందులో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు.