తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

సమయం విలువ తెలిస్తేనే బెస్ట్ పొజిషన్​కు!- టైమ్ మేనేజ్​మెంట్ స్కిల్స్ మీలో ఉన్నాయా? - Time Management Skills In Telugu - TIME MANAGEMENT SKILLS IN TELUGU

Time Management Skills In Telugu : గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. మనలో చాలా మందికి సమయం విలువ తెలియదు. సమయపాలనను అస్సలు పట్టించుకోరు. ప్రతి విషయంలోనూ బద్దకంగా ఉంటారు. ఎంతో విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు. ప్రతి వ్యక్తి మెరుగుపరుచుకోవాల్సిన టైమ్​ మేనేజ్​మెంట్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం.

time management skills in telugu
time management skills in telugu

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 4:43 PM IST

Time Management Skills In Telugu :చిన్నప్పటి నుంచి టైమ్ ఈజ్ మనీ అనే మాట వింటూనే ఉంటాం సమయం విలువ తెలిసినవారు జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటారని పెద్దలు చెబుతుంటారు. కానీ కొంత మంది జీవితంలో విజయం సాధించకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. అందులో ముఖ్యమైనది సమయం. సమయం విలువ తెలియపోవడం వల్ల చేసే పనిలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా సమయపాలన, క్రమశిక్షణ అనేది ఉండాలి. మీ వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే చాలా అంశాలు దోహదం చేస్తాయి. ఇందులో ముఖ్యమైంది టైమ్ మెనేజ్​మెంట్. ఇది అనేక సవాళ్లతో కూడుకుంది. మీ టైమ్ మేనేజ్​మెంట్ స్కిల్స్ మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

స్పష్టమైన లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి:
మీరు విజయం వైపు పయనించాలంటే అది స్వల్పకాలిక కావచ్చు, దీర్ఘకాలిక కావచ్చు. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న విభజించుకోవాలి. మీరేం సాధించాలనుకుంటున్నారో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. సమయాన్ని సమర్ధవంతంగా కేటాయించడంలో సహాయపడుతుంది.

ప్రాధాన్యం:
విజయవంతమైన సమయం నిర్వహణకు ప్రధానం ప్రాధాన్యమే. మీరు రోజువారీ పనుల్లో ప్రాధాన్యం అంశాలకు సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అతి తక్కువ కాలంలో మరో మెట్టు ఎదుగుతారు. అనుకున్న సమయానికి ప్రాధాన్యమైన అంశాలను పూర్తి చేస్తే దాదాపు మీరు ఆరోజును విజయవంతంగా ముగించినట్లే అవుతంది.

మల్టీ టాస్కింగ్​ను పక్కన పెట్టండి:
చాలా మంది ఒకే సమయంలో రకరకాల పనులు చేయాలనుకుంటారు. వాస్తవానికి మల్టీ టాస్కింగ్ అనేది ఉత్పాదకత, పని క్వాలిటీని తగ్గిస్తుంది. దీనికి బదులుగా ఏకాగ్రత, మెరుగైన ఫలితాలు ఎలా పొందాలనే అంశంపై ఫోకస్ పెట్టండి.

సమయాన్ని వృథా చేయొద్దు:
సమయాన్ని వృథా చేయకూడదు. ప్రతినిమిషం కూడా చాలా విలువైంది. సమయం వృథా కావొద్దంటే ఏ పని ముందు చేయాలి. ఏది తర్వాత చేయాలనేది ఆలోచించుకోవాలి. చేసే పని పాజిటివ్ కోణంలో చేస్తే తిరిగి ఆ పనిచేయాల్సిన అవసరం రాదు.

కాదని చెప్పండి:
మీ సమయాన్ని వృథా చేసే మీ లక్ష్యాలను దెబ్బ తీసే పనులకు చేయాలేమని చెప్పండి. మీరు చేయాల్సిన పనులకు సరిహద్దులను ఏర్పాటు చేసుకుని సమాయానికి ప్రాధాన్యమివ్వడం ముఖ్యం.

వాయిదా వేయడం:
వాయిదా వేయడం అనేది మీ సమయాన్ని వృథ చేస్తుంది. వాయిదా వేయకుండా మీరు చేపట్టిన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించడం వల్ల మరింత ప్రభావవంతంగా పనిచేయడంలో సహాయపడుతుంది.

అభిప్రాయం:
మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఏ విషయంలో బాగా పనిచేస్తున్నారు? ఎలాంటి పనులను సర్దుబాటు చేసుకోవాలనే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ లక్ష్యం మీ భవిష్యత్తులో చేరుకోవాలనుకుంటున్న స్థానానికి సంబంధించి నిర్దిష్ట నైపుణ్యాలను మెరుగుపరచడం అనేది స్వల్పకాలిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. మీ లక్ష్యాలను నిర్దిష్టంగా సాధించేలా, ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details