Software Engineering Interview Questions :ప్రస్తుత కాలంలో చాలా మంది యువతీయువకులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ జీతాలు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తుండడమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాలంటే, ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఉద్యోగాన్ని ఒడిసిపట్టుకోగలుగుతారు. అందుకే ఈ ఆర్టికల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాలంటే ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్స్ : కోడింగ్‌కు వెన్నెముకగా డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్ పనిచేస్తాయి. అందుకే ఇంటర్వ్యూ చేసేవారు డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్‌లపై మిమ్నల్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.
2. ప్రోబ్లమ్ సాల్వింగ్ :సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉండాలి. అందువల్ల ఇంటర్వ్యూ చేసేవారు కొన్ని దృశ్యాలను ప్రదర్శించి, వాటికి మీరు కోడ్‌ను ఉపయోగించి సొల్యూషన్స్ కనుక్కొవాలని అడుగుతారు. మీరు సమస్యను చిన్న చిన్నభాగాలు విడదీసి, వాటికి కోడింగ్ రాయగలగాలి. చాలా క్లారిటీతో, ఎఫీషియెన్సీతో కోడింగ్ రాసి, సరైన పరిష్కారం చూపించగలగాలి. ఈ విధంగా మీ కోడింగ్ స్కిల్స్‌తో ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకోవాలి.
3. టెక్నికల్ ప్రొఫీషియెన్సీ :సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, డెవలప్‌మెంట్ టూల్స్‌లో ప్రావీణ్యం అవసరం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్స్ (IDE), వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, డీబగ్గింగ్ యుటిలిటీస్ వంటి టూల్స్‌పై మంచి పట్టు సాధించండి. మీరు ఎంచుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మంచి పట్టు కలిగి ఉండండి. డెవలప్‌మెంట్ టూల్స్ ఉపయోగించడంలో మీరు చూపే ప్రతిభ ఇంటర్వ్యూ చేసేవారికి మీపై సానుకూల దృక్పథం ఏర్పడేలా చేస్తుంది.