SBI SCO Recruitment 2024 :బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- రిలేషన్షిప్ మేనేజర్ - 273 పోస్టులు
- వీపీ వెల్త్ - 643 పోస్టులు
- రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) - 32 పోస్టులు
- రీజినల్ హెడ్ - 6 పోస్టులు
- ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ - 30 పోస్టులు
- ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ - 49 పోస్టులు
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రోడక్ట్ లీడ్) - 2 పోస్టులు
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) - 2 పోస్టులు
- ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) - 1 పోస్టు
- ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) - 2 పోస్టులు
- మొత్తం పోస్టులు - 1,040
విద్యార్హతలు
SBI SCO Eligibility :
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) :ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎం లేదా సీఏ/ సీఎఫ్ఏ చదివి ఉండాలి. NISM ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/ రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికెట్/ సీఎఫ్పీ/ ఎన్ఐఎస్ఎం 21A లేదా 21B ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- రిలేషన్షిప్ మేనేజర్ : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్లో కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
- ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ : ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సీఏ/ సీఎఫ్ఏ చదివి ఉండాలి. కనీసం 6 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
SBI SCO Age Limit :
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) : అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- రిలేషన్షిప్ మేనేజర్ : అభ్యర్థుల వయస్సు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- రీజినల్ హెడ్ : అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు
SBI SCO Application Fee :
- జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి.
- ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.