తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - రైల్వేలో 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ!

RRB Technician Jobs 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్​ 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRB technician Jobs 2024
RRB Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 10:09 AM IST

RRB Technician Jobs 2024 : రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ (ఆర్​ఆర్​బీ) 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుది.

ఉద్యోగాల వివరాలు

  • టెక్నీషియన్ గ్రేడ్​-1 సిగ్నల్ : 1100 పోస్టులు
  • టెక్నీషియన్ గ్రేడ్​-3 సిగ్నల్​ : 7900 పోస్టులు
  • మొత్తం పోస్టులు : 9000

విద్యార్హతలు
RRB Technician Job Eligibility :అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.

వయోపరిమితి
RRB Technician Job Age Limit :

  • టెక్నీషియన్​ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 36 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • టెక్నీషియన్​ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 33 ఏళ్లు మధ్యలో ఉండాలి.

పరీక్ష ఫీజు
RRB Technician Job Application Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.500 చెల్లించాలి.
  • మహిళలు, మాజీ సైనికులు, ఈబీసీ, మైనారిటీ, ట్రాన్స్​జెండర్​, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
RRB Technician Selection Process :అభ్యర్థులకు ఫస్ట్, సెకండ్ స్టేజ్​ల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి, వీటన్నింటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను టెక్నీషియన్ పోస్టులకు ఎంపిక చేస్తారు. వీరు దేశంలో రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

ఆర్​ఆర్​బీ రీజియన్స్​
అహ్మదాబాద్​, అజ్మేర్​, బెంగళూరు, భోపాల్​, భువనేశ్వర్​, బిలాస్​పుర్​, చండీగఢ్​, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్​, కోల్​కతా, మాల్దా, ముంబయి, ముజఫర్​పుర్​, పట్నా, ప్రయాగ్​రాజ్​, రాంచీ, సికింద్రాబాద్​, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్​పుర్​.

జీతభత్యాలు
RRB Technician Salary :

  • టెక్నీషియన్ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 వేతనం ఉంటుంది.
  • టెక్నీషియన్ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 వేతనం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :
RRB Technician Jobs 2024 Apply Last Date :

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 9
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్​ 8

నోట్​ :రీజియన్లవారీ పోస్టుల వివరాలు, విద్యార్హతలు, సిలబస్​, రాత పరీక్ష తేదీల వివరాలు, పూర్తి నోటిఫికేషన్​లో విడుదల చేసే అవకాశం ఉంది.

SBIలో 131 'స్పెషలిస్ట్' ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

ఇంటర్​ అర్హతతో ఇండియన్ కోస్ట్​ గార్డ్​లో 260 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details