RRB NTPC Recruitment 2024 : నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,445 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎన్టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ (అండర్ గ్రాడ్యుయేట్) కేటగిరీలో - కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్ఆర్బీ రీజియన్లు :సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్, అజ్మేర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - 2,022 పోస్టులు
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 361 పోస్టులు
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 990 పోస్టులు
- ట్రైన్స్ క్లర్క్ - 72 పోస్టులు
- మొత్తం పోస్టుల సంఖ్య - 3,445
రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు
- ఆర్ఆర్బీ భువనేశ్వర్ - 56
- ఆర్ఆర్బీ బెంగళూరు - 60
- ఆర్ఆర్బీ చెన్నై - 194
- ఆర్ఆర్బీ సికింద్రాబాద్ - 89
విద్యార్హతలు :
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి :
- 2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- దివ్యాంగులకు, ఎస్టీ, ఎస్సీలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
- మహిళలు, ఈబీసీ, ఈఎస్ఎం, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.250 కట్టాలి.
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం : కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌లకు నెలకు రూ.21,700; ఇతర పోస్టులకు రూ.19,900 జీతం ఉంటుంది.
పరీక్ష విధానం
- ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ :జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు - 40 మార్కులు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు - 40 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (40 ప్రశ్నలు - 40 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య - 100, మొత్తం మార్కులు - 100. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
- సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ :జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు - 35 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య - 120, మొత్తం మార్కుల సంఖ్య - 120. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం
- ముందుగా మీరు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- RRB NTPC Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీకొక ఎన్రోల్మెంట్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- వీటితో మళ్లీ ఆర్ఆర్బీ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.
- ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
ముఖ్య తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 21
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 20
- దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2024 అక్టోబర్ 22
- దరఖాస్తు సవరణ తేదీలు : 2024 అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు
టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 5066 ఉద్యోగాలు - రాత పరీక్ష, వైవా లేదు! - RRC WR Apprentice Recruitment 2024
ఇంటర్, డిగ్రీ అర్హతతో - రైల్వేలో 11,558 పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB NTPC Recruitment 2024