తెలంగాణ

telangana

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 జేఈ, సూపర్​ వైజర్​ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 10:38 AM IST

RRB JE Recruitment 2024 : రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. 7,951 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

Railway jobs
Indian railways (ANI)

RRB JE Recruitment 2024 :రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసింది. వీటిలో 7,934 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఉన్నాయి. మరో 17 కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ పోస్టులు ఉన్నాయి. ఇవి కేవలం ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ పరిధికి చెందిన పోస్టులు.

విద్యార్హతలు
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన వారు అప్లై చేయొచ్చు.

వయోపరిమితి
2025 జనవరి 1 నాటికి 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు రూ.500. ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు, ఎస్టీ,ఎస్సీలకు ఫీజు రూ.250.

జీతభత్యాలు

  • జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.35,400 ప్రారంభ వేతనం అందిస్తారు.
  • కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ పోస్టులకు ఎంపికయ్యే వారికి రూ.44,900 ప్రారంభ వేతనం ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ
స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

స్టేజ్-1 పరీక్ష :స్టేజ్‌-1 పరీక్షలో మ్యాథ్స్‌ (30 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (25 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు), జనరల్ సైన్స్ (30 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్ష కోసం 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.

స్టేజ్-2 పరీక్ష :స్టేజ్‌-2 పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు), ఫిజిక్స్ అండ్‌ కెమిస్ట్రీ (15 ప్రశ్నలు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (10 ప్రశ్నలు), బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ (10 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటికి తోడు టెక్నికల్ ఎబిలిటీస్‌కు సంబంధించిన 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పరీక్ష రాయాలి.

దరఖాస్తు విధానం

  • ముందుగా మీరు ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • RRB JE 2024 లింక్​పై క్లిక్ చేయాలి.
  • మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్​లను ఎంటర్​ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక ఎన్​రోల్​మెంట్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • వీటితో మళ్లీ ఆర్​ఆర్​బీ పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు
జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో సవరణలను చేసుకునేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 8 వరకు అవకాశం కల్పిస్తారు.

ప్రాంప్ట్‌ ఇంజినీర్స్‌కు ఫుల్ డిమాండ్- బడా కంపెనీల్లో సూపర్ ప్యాకేజీ- అర్హతలేంటి? - AI Prompt Engineers Recruitment

డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతతో - ఇండియన్​ నేవీలో 741 పోస్టులు - దరఖాస్తుకు మరో 7 రోజులే ఛాన్స్​! - Indian Navy Recruitment 2024

ABOUT THE AUTHOR

...view details