RPF SI And Constable Jobs 2024 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లోని 4660 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఆర్పీఎఫ్ ఎస్ఐ - 452 పోస్టులు
- ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ - 4208 పోస్టులు
- మొత్తం పోస్టులు - 4660
విద్యార్హతలు
RPF SI And Constable Job Eligibility :సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం ఎస్ఎస్ఎల్సీ (10వ తరగతి) చదివి ఉండాలి.
వయోపరిమితి
RPF SI And Constable Job Age Limit :
- ఎస్ఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు.
సబ్-ఇన్స్పెక్టర్ ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)
- ఎస్ఐ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్‌లో 1600 మీటర్ల దూరాన్ని కేవలం 6 నిమిషాల 30 సెకెన్లలో పూర్తి చేయాలి.
- ఎస్ఐ స్త్రీ అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్‌లో 800 మీటర్ల దూరాన్ని కేవలం 4 నిమిషాల్లో పూర్తి చేయాలి.
- ఎస్ఐ పురుష అభ్యర్థులు 12 అడుగల లాంగ్ జెంప్, 3 అడుగుల 9 ఇంచీలు హై జెంప్ చేయాలి.
- ఎస్ఐ స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్ జెంప్, 3 అడుగుల హై జెంప్ చేయాలి.
కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)
- కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్‌లో 1600 మీటర్ల దూరాన్ని కేవలం 5 నిమిషాల 45 సెకెన్లలో పూర్తి చేయాలి.
- కానిస్టేబుల్ స్త్రీ అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్‌లో 800 మీటర్ల దూరాన్ని కేవలం 3 నిమిషాల 40 సెకెన్లలో పూర్తి చేయాలి.
- కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు 14 అడుగల లాంగ్ జెంప్, 4 అడుగుల 9 ఇంచీలు హై జెంప్ చేయాలి.
- కానిస్టేబుల్ స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్ జెంప్, 3 అడుగుల హై జెంప్ చేయాలి.