Punjab National Bank Recruitment 2024 :బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగాలను భర్తీ చేయు సంస్థ :పంజాబ్ నేషనల్ బ్యాంక్
మెత్తం పోస్టుల సంఖ్య : 1025
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
- క్రెడిట్ ఆఫీసర్- 1000
- ఫారెక్స్ మేనేజర్-15
- సైబర్ సెక్యూరిటీ మేనేజర్-5
- సీనియర్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్-5
విద్యార్హతలు
- క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు- సీఏ ఉత్తీర్ణత చెంది ఉండాలి. సీఎంఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ ఉత్తీర్ణత చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిలో కనీసం 60% మార్కులను పొంది ఉండాలి.
- ఫారెక్స్ మేనేజర్ పోస్టులకు- ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్‌లో సమానమైన అర్హత కలిగి ఉండాలి. కనీసం 60% మార్కులను పొంది ఉండాలి.
- సైబర్ సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు- బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉత్తీర్ణత చెంది ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుంచి కనీసం 60% మార్కులతో ఎంసీఏ ఉత్తీర్ణత చెందిన వారు ఈ పోస్టులకు అర్హులు.
- సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు- కంప్యూటర్ సైన్స్‌లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత చెంది ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్(ఫుల్ టైమ్) చేసి ఉండాలి.