తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఎడ్యుకేషన్​ లోన్ కావాలా? బ్యాంక్​కు వెళ్లకుండానే ఆన్​లైన్​లోనే అప్లై చేసుకోండిలా! - Education Loan Online Apply Process - EDUCATION LOAN ONLINE APPLY PROCESS

PM Vidya Lakshmi Education Loan Yojana Apply : బ్యాంకు నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడమంటే మాటలా! అవసరమైన పత్రాలెన్నో సమర్పించాలి. రుణం మంజూరవ్వటం కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలో తెలియదు. ఇంత కష్టపడ్డా చివరికి విద్యారుణం వస్తుందో? రాదో? కూడా తెలియదు. ఇలాంటి సమస్యలు మీకూ అనుభవమా? మరి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే లోన్ గురించి మీకు తెలుసా? విదేశాల్లో ఉన్నత విద్య కోసం రూ.15 లక్షల రుణం పొందొచ్చు? ఆ పథకం ఏంటో? ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

PM Vidya Lakshmi Education Loan Yojana Apply
PM Vidya Lakshmi Education Loan Yojana Apply (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 4:15 PM IST

PM Vidya Lakshmi Education Loan Yojana Apply :ప్రస్తుత కాలంలో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులు పెరిగిపోయాయి. స్కూల్, ఇంటర్మీడియట్ వరకు ఎలాగోలా చదువుకోగలిగినా, ఆపై చదువులు చాలా మంది చదవలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో పీఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ ​లోన్ యోజన పేరుతో ఓ స్కీమ్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఏ భారతీయ పౌరులైనా ఉన్నత విద్య కోసం రూ.15లక్షల వరకు బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు. ఆన్​లైన్​లోనే లోన్ కోసం అప్లై చేయవచ్చు.

ఆర్థిక ఇబ్బందులతో చదువు ముందుకు కొనసాగించలేని వారెవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. 10+2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఈ పథకం కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా విద్యార్థులు బ్యాంకుల నుంచి రూ.7.5 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకుంటే రూ.15 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఈ స్కీమ్ కింద స్కాలర్‌షిప్స్‌, విద్యా రుణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి పీఎం విద్యా లక్ష్మి యోజన అధికారిక వెబ్​సైట్‌ https://www.vidyalakshmi.co.in/Students/ సందర్శించవచ్చు. ఈ వెబ్​సైట్​లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ప్రాసెస్

  • ముందు విద్యాలక్ష్మి పోర్టల్‌ https://vidyalakshmi.co.in/లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి.
  • అకౌంట్​ లాగిన్ అయ్యాక కామన్ ఎడ్యుకేషన్​లోన్ అప్లికేషన్ ఫామ్‌ (CELAF) ట్యాబ్​పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి.
  • ఫామ్​ను ఫిల్ చేశాక అవసరాలకు అనుగుణంగా విద్యా రుణం కోసం సెర్చ్ చేయవచ్చు.
  • మీ అవసరాలు, అర్హత, సౌలభ్యం ఆధారంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విద్యాలక్ష్మి పోర్టల్​లో CELAF ద్వారా ఒక విద్యార్థి గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ ఫామ్​ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) జారీ చేసింది.

ఈ పథకం కింద 13 బ్యాంకులు లిస్ట్ అయ్యాయి. ఇవి 22 రకాల విద్యా రుణాలు ఇస్తాయి. రుణం కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డు, పాస్‌ పోర్ట్ సైజు ఫొటో, అడ్రెస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం తప్పనిసరి. పైన పేర్కొన్న డాక్యుమెంట్స్​తోపాటు తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, హైస్కూల్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్​ల జిరాక్స్​లు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చదవబోయే సంస్థ అడ్మిషన్ కార్డు అందించాలి. అన్ని రకాల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు, కోర్సు వ్యవధి కూడా అందులో పొందుపర్చాలి.

ABOUT THE AUTHOR

...view details