NLC Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLC) 239 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాల వివరాలు
- ఇండస్ట్రియల్ ట్రైనీ (ఎస్ఎంఈ & టెక్నికల్) - 100 పోస్టులు
- ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ & మైన్స్ సపోర్ట్ సర్వీసెస్) - 139 పోస్టులు
విద్యార్హతలు
NLC Industrial Trainee Job Eligibility :సంబంధిత విభాగంలో ఐటీఐ (ఎన్టీసీ), మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులకు అర్హులు.
వయోపరిమితి
NLC Industrial Trainee Age Limit : అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 37 ఏళ్లు; ఓబీసీలకు 40 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 42 ఏళ్లులోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
NLC Industrial Trainee Selection Process :అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
NLC Industrial Trainee Salary :
- ఇండస్ట్రియల్ ట్రైనీ (ఎస్ఎంఈ & టెక్నికల్)లకు మొదటి ఏడాది రూ.18,000; రెండో ఏడాది రూ.20,000; మూడో ఏడాది రూ.22,000 సాలరీ ఉంటుంది.
- ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ & మైన్స్ సపోర్ట్ సర్వీసెస్)లకు మొదటి ఏడాది రూ.14,000; రెండో ఏడాది రూ.16,000; మూడో ఏడాది రూ.18,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం
NLC Industrial Trainee Application Process :
- అభ్యర్థులు ముందుగా ఎన్ఎల్సీ అధికారిక వెబ్సైట్ https://www.nlcindia.in ఓపెన్ చేయాలి.
- కేరీర్స్ సెక్షన్లోకి వెళ్లి Industrial Trainee అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
NLC Industrial Trainee Important Dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 20
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్ 19
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 అప్రెంటీస్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 'నవోదయ'లో 1377 నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ!