LIC Recruitment 2024 :లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఉన్న 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో గడువులోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- మొత్తం పోస్టులు - 200
- ఆంధ్రప్రదేశ్ - 12 పోస్టులు
- తెలంగాణ - 31 పోస్టులు
విద్యార్హతలు
LIC HFL Junior Assistant Qualification : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి
LIC HFL Junior Assistant Age Limit : అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
LIC HFL Junior Assistant Fee :అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.800 + జీఎస్టీ చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
LIC HFL Junior Assistant Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ పరీక్ష పెడతారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
LIC HFL Junior Assistant Salary : జూనియర్ అసిస్టెంట్లకు నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 వరకు జీతం ఉంటుంది.
పరీక్ష విధానం
LIC HFL Junior Assistant Exam Pattern :అభ్యర్థులకు 200 మార్కులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీనిని 120 నిమిషాల వ్యవధిలోనే రాయాల్సి ఉంటుంది. లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ స్కిల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం
LIC HFL Junior Assistant Application Process :
- అభ్యర్థులు ముందుగా ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ అధికారిక వెబ్సైట్ https://www.lichousing.com/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లోని Careers ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- LIC HFL Junior Assistant Notification 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తి, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జులై 25
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 15
- పరీక్ష తేదీ : 2024 సెప్టెంబర్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 జేఈ, సూపర్ వైజర్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024
డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతతో - ఇండియన్ నేవీలో 741 పోస్టులు - దరఖాస్తుకు మరో 7 రోజులే ఛాన్స్! - Indian Navy Recruitment 2024