Latest Bank Jobs 2024 :బ్యాంక్ ఉద్యోగార్థులకు గుడ్న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు
Union Bank of India Jobs :606 పోస్టులు
వయో పరిమితి
Union Bank of India Jobs Age Limit :పోస్టులను అనుసరించి కనిష్ఠ, గరిష్ఠ వయో పరిమితులను నిర్దేశించారు. నోటిఫికేషన్ ప్రకారం కనిష్ఠంగా 20, గరిష్ఠంగా 45 ఏళ్ల వయసు ఉండాలి.
పోస్టుల వివరాలు
Union Bank of India Specialist Officer Posts :
- చీఫ్ మేనేజర్- ఐటీ(సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్)- 2 పోస్టులు
- చీఫ్ మేనేజర్- ఐటీ(క్వాలిటీ అష్యురెన్స్ లీడ్)- 1
- చీఫ్ మేనేజర్- ఐటీ(ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్)- 1
- చీఫ్ మేనేజర్- ఐటీ(ఎగైల్ మెథడాలజీస్ స్పెషలిస్ట్)- 1
- సీనియర్ మేనేజర్- ఐటీ(అప్లికేషన్ డెవలపర్)- 4
- సీనియర్ మేనేజర్- ఐటీ(Dev Sec Ops ఇంజినీర్)- 2
- సీనియర్ మేనేజర్- ఐటీ(రిపోర్టింగ్ అండ్ ఈటీఎల్ స్పెషలిస్ట్, మానిటరింగ్ అండ్ లాగింగ్)- 2
- సీనియర్ మేనేజర్ (రిస్క్)- 20
- సీనియర్ మేనేజర్(ఛార్టర్డ్ అకౌంటెంట్)- 14
- మేనేజర్- ఐటీ (ఫ్రంట్-ఎండ్/ మొబైల్ యాప్ డెవలపర్)- 2
- మేనేజర్- ఐటీ (ఏపీఐ ప్లాట్ఫామ్ ఇంజినీర్/ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్)- 2
- మేనేజర్ (రిస్క్)- 27
- మేనేజర్ (క్రెడిట్)- 371
- మేనేజర్ (లా)- 25
- మేనేజర్ (ఇంటిగ్రేటడ్ ట్రెజరీ ఆఫీసర్)- 5
- మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)- 19
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్)- 2
- అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజినీర్)- 2
- అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్)- 1
- అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)- 30
- అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్)- 73
విద్యార్హతలు
Union Bank Of India Jobs Qualification :బీఎస్సీ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, సీఎఫ్ఏతో పాటు పని అనుభవం తప్పనిసరి.