Jobs That Are Safe From AI :ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పలు రంగాల్లో భారీ స్థాయిల్లో ఉద్యోగాలు పోతాయని వార్తలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ వినియోగం పెరిగడం వల్ల నిరుద్యోగులు ఎక్కువైపోతారని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏఐ టెక్నాలజీ ఎంత పెరిగినా, కొన్ని రంగాలకు చెందిన ఉద్యోగులకు ఏ మాత్రం భయంలేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. ఆరోగ్య సంరక్షణ నిపుణులు (హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్)
వైద్యులు, నర్సులు, థెరపిస్ట్‌లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయలేదు. కనుక ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ జాబ్లకు ఏఐతో ఎటువంటి ప్రమాదం ఉండదు.
2. సృజనాత్మక వృత్తులు (క్రియేటివ్ ప్రొఫెషన్స్)
రచయితలు, కళాకారులు, సంగీతకారులు, డిజైనర్లకు ప్రత్యేకమైన సృజనాత్మకత, కళాత్మకత ఉంటుంది. వీటిని కృత్రిమ మేధ చేయలేదు. కనుక సృజనాత్మక వృత్తినిపుణులకు ఎలాంటి ఢోకా ఉండదు.
3. మానసిక ఆరోగ్య నిపుణులు (మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్)
మనస్తత్వవేత్తలు, సలహాదారులు (కౌన్సిలర్లు), సామాజిక కార్యకర్తలు - వ్యక్తుల భావోద్వేగాలను, మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని, వారికి తగిన ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. వీటిని ఏఐ చేయలేదు. కనుక ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌పై ఏఐ ప్రభావం పడదు.
4. హెచ్‌ఆర్ నిపుణులు
హెచ్‌ఆర్ నిపుణులు ఉద్యోగుల రిక్రూట్‌మెంట్, వారి సాలరీలు నిర్ణయించడం సహా కంపెనీ బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. భిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ఉద్యోగుల భావోద్వేగాలను, సంఘర్షణలను అర్థం చేసుకుని, పరిష్కారం చూపగలుగుతారు. వీటిని కృత్రిమ మేధ చేయలేదు. కనకు హెచ్‌ఆర్ నిపుణులు సేఫ్!
5. స్కిల్డ్ ట్రేడ్స్
మన నిత్య జీవితంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, మెకానిక్‌ల అవసరం ఎంతో ఉంటుంది. ఏఐ ఉపయోగించి ఈ పనులు చేయలేము. కనుక మంచి నైపుణ్యమున్న వృత్తి నిపుణులకు ఏఐతో ఎలాంచి ముప్పు ఉండదు.