తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

పోస్టల్​ శాఖలో 44,228 పోస్టులు​ - పది పాసైతే చాలు - పరీక్ష లేకుండానే జాబ్​ - అప్లై చేసుకోండిలా! - Postal Jobs 2024 - POSTAL JOBS 2024

India Post GDS Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. ఇండియా పోస్ట్​ 44,228 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను పొందవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

POSTAL JOBS 2024
India Post GDS Recruitment 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 10:47 AM IST

India Post GDS Recruitment 2024 :ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్​ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 44,228 పోస్టుల భర్తీ కోసం గ్రామీణ డాక్ సేవక్​ (జీడీఎస్​) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • బ్రాంచ్​ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్​ మాస్టర్ (ఏబీపీఎం)
  • డాక్​ సేవక్​

తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య

  • ఆంధ్రప్రదేశ్​ - 1355 పోస్టులు
  • తెలంగాణ - 981 పోస్టులు

విద్యార్హతలు
India Post GDS Jobs Eligibility :అభ్యర్థులు పదో తరగతి పాసైతే చాలు.

వయోపరిమితి
India Post GDS Age Limit :అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
India Post GDS Application Fee :అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
India Post GDS Selection Process :పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

జీతభత్యాలు
India Post GDS Salary :

  • బ్రాంచ్ పోస్ట్ మాస్టర్​కు నెలకు రూ.12,000 నుంచి 29,380 వరకు జీతం ఉంటుంది.
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్​, డాక్​ సేవక్​ పోస్టులకు నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం
India Post GDS Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్​సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయాలి.
  • మీ వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్​, ఫోన్​ నంబర్లను ఎంటర్ చేసి, పోర్టల్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • తరువాత Apply Online లింక్​పై క్లిక్ చేసి, మీ డివిజన్, పోస్ట్ ప్రిఫరెన్స్​లను ఎంచుకోవాలి.
  • మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్​లను కూడా అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 జులై 15
  • ఆన్​లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 5
  • దరఖాస్తు సవరణ తేదీలు : 2024 ఆగస్టు 6 నుంచి 8 వరకు

ఇంటర్వ్యూల్లో అడిగే టాప్​-10 ప్రశ్నలు ఇవే! ఇలా సమాధానాలు చెబితే జాబ్​ పక్కా! - Most Asked Interview Questions

ఏజ్​ బార్ అవుతోందని భయంగా ఉందా? ఈ స్ట్రాటజీ పాటిస్తే - కోరుకున్న ఉద్యోగం గ్యారెంటీ! - Job Hunting Tips

ABOUT THE AUTHOR

...view details