తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

IDBI బ్యాంకులో 500 ఉద్యోగాలు- రూ.50వేల శాలరీ, అప్లైకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే? - idbi bank selection process

IDBI Bank Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్​న్యూస్​. ఐడీబీఐ బ్యాంకు 500 పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ఫీజు తదితర వివరాలు మీ కోసం.

IDBI Bank Recruitment 2024
IDBI Bank Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 11:26 AM IST

IDBI Bank Recruitment 2024 :దేశవ్యాప్తంగా ఐడీబీఐ బ్యాంకు జోన్లలో ఖాళీగా ఉన్న 500 జూనియర్​ అసిస్టెంట్ మేనేజర్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బెంగళూరులోని మణిపాల్​, గ్రేటర్​ నోయిడాలోని నిట్టే విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లమా ఇన్​ బ్యాంకింగ్ అండ్​ ఫైనాన్స్​(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఐడీబీఐ బ్యాంకు ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ ఫైనాన్స్​ విభాగంలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి జూనియర్ అసిస్టెంట్​ (గ్రేడ్​- ఓ) ఉద్యోగం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, పరీక్షా కేంద్రాల వివరాలు, ఫీజు తదితర వివరాలు మీకోసం.

నోటిఫికేషన్​ వివరాలు

పోస్టు పేరు :జూనియర్​ అసిస్టెంట్ మేనేజర్​

  • మొత్తం పోస్టుల సంఖ్య : 500
  • యూఆర్​- 203 పోస్టులు
  • ఎస్సీ-75 పోస్టులు
  • ఎస్టీ-37 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​-50 పోస్టులు
  • ఓబీసీ-135 పోస్టులు

అర్హతలు

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత చెందిన వారు ఈ జూనియర్​ అసిస్టెంట్ పోస్టులుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయసు 31/01/2024 నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

  • ఆన్​లైన్​ టెస్ట్
  • ఇంటర్య్వూ
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్​ ​
  • మెడికల్​ టెస్ట్​
  • దరఖాస్తు విధానం :ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
  • పీజు :ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.1000 ఫీజు ఉంటుంది.
  • జోన్లు :అహ్మదాబాద్, భోపాల్​, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, నాగ్​పుర్, పుణె, భువనేశ్వర్, పట్నా, చండీగఢ్, దిల్లీ, లఖ్​నవూ.

శిక్షణ, ఫీజు వివరాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థలు ఏడాది పాటు పీజీ డిప్లొమా ఇన్​ బ్యాంకింగ్ ఫైనాన్స్ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు. కోర్సు ఫీజు కింద రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా టెర్మ్​ల వారీగా ఫీజు చెల్లించవచ్చు. అర్హత గల అభ్యర్థులకు ఎడ్యుకేషన్​లోన్​ కూడా మంజూరు చేస్తుంది. అభ్యర్థలు మూడేళ్లు సర్వీస్​ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణకాలంలో ఆరు నెలల పాటు రూ.5000 ఇస్తారు. ఇంటర్న్​షిప్​ సమయంలో నెలకు రూ.15 వేలు ఇస్తాయి. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని జాబ్​లో చేరిన వారికి ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వార్షిక ప్యాకేజ్​ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే!

  • ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ : 12-02-2024
  • ఆన్​లైన్​ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 26-02-2024

ప్రభుత్వ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా! లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

ఇంటర్​, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు- దరఖాస్తు చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details