తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ITI అర్హతతో - రైల్వేలో 1010 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Apprentice Posts 2024 - RAILWAY APPRENTICE POSTS 2024

Railway Apprentice Posts 2024 : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీలో 1010 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వయోపరిమితి, ఫీజు, జీతం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

railway jobs 2024
indian railways (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 12:06 PM IST

Railway Apprentice Posts 2024 : చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికిగాను 1010 యాక్ట్​ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రేడ్స్​

  • కార్పెంటర్ - 90 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ - 180 పోస్టులు
  • ఫిట్టర్ - 260 పోస్టులు
  • మెషినిస్ట్ - 90 పోస్టులు
  • పెయింటర్​ - 90 పోస్టులు
  • వెల్డర్ - 260 పోస్టులు
  • ఎంఎల్​టీ రేడియాలజీ -5 పోస్టులు
  • ఎంఎల్​టీ పాథాలజీ - 5 పోస్టులు
  • పీఏఎస్​ఏఏ - 10 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1010

విద్యార్హతలు
ICF Chennai Apprentice Job Eligibility : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్​ (ఫిజిక్స్​, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్​లో ఐటీఐ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నాన్​-ఐటీఐ అభ్యర్థులు కూడా అర్హులే.

వయోపరిమితి
ICF Chennai Apprentice Job Age Limit :

  • ఐటీఐ అభ్యర్థుల వయస్సు 2024 జూన్​ 21 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • నాన్​-ఐటీఐ అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
ICF Chennai Apprentice Application Fee :

  • అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
  • మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
ICF Chennai Apprentice Selection Process :అకడమిక్​ మార్కుల మెరిట్​, రూల్​ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టైపెండ్​
ICF Chennai Apprentice Salary :యాక్ట్ అప్రెంటీస్​లకు నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు చెన్నై ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీ అధికారిక వెబ్​సైట్​ https://pb.icf.gov.in ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • అప్పుడు మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • 'అప్లై ఆన్​లైన్' లింక్​పై క్లిక్ చేసి, లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 మే 22
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జూన్ 21

BSFలో 144 ఎస్​ఐ, కానిస్టేబుల్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - BSF Recruitment 2024

'పెద్ద జీతంతో ఉద్యోగం రావాలంటే - ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే' - ఇన్ఫోసిస్​ సీటీఓ - AI Skills For IT Job

ABOUT THE AUTHOR

...view details