IBPS Clerk Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఎంపికైన వారు రీజనల్ రూరల్ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ జూన్ 6న ఆర్‌ఆర్‌బీ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XIII నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీసర్(స్కేల్-1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్)/ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాల వివరాలు
- ఆఫీసర్ (స్కేల్- I, II, III)
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)/ క్లర్క్
విద్యార్హతలు
పోస్టులను అనుసరించి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి తీరాలి.
వయస్సు
- ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.