తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

మీ టెన్త్​ సర్టిఫికెట్​లో స్పెల్లింగ్​ తప్పు పడిందా? - ఏం చేయాలో తెలుసా? - CORRECTIONS IN 10TH CERTIFICATE

- మూడు పద్ధతులు సూచిస్తున్న నిపుణులు - అవేంటో మీకు తెలుసా?

How to Correct Name in 10th Certificate
How to Correct Name in 10th Certificate (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

How to Correct Name in 10th Certificate : సర్టిఫికెట్లలో తప్పులు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఆధార్, పాన్ కార్డు వంటి వాటిల్లో తప్పులు, వాటి కరెక్షన్స్​ గురించి అందరికీ తెలిసిందే. అయితే.. స్టడీ సర్టిఫికెట్ల్ విషయానికి వస్తే మాత్రం.. కాస్త టెన్షన్​గా ఉంటుంది. ఆధార్ వంటి వాటిల్లో తప్పులు సరిచేయడానికి రోడ్డుపక్కన ఉండే సెంటర్లకు వెళ్తే సరిపోతుంది. కానీ.. స్టడీ సర్టిఫికెట్లలో తప్పులు సరిచేయడం అనేది పెద్ద ప్రాసెస్. ఎడ్యుకేషన్​లో ఫస్ట్ బోర్డ్​ ఎగ్జామ్​గా చెప్పుకునే పదోతరగతి సర్టిఫికెట్లో తప్పులు దొర్లితే.. ఆ ప్రభావం ఆ తర్వాతి తరగతుల ధ్రువపత్రాలపైన కూడా పడే ఛాన్స్ ఉంది. అందుకే.. ఈ పొరపాట్లను వెంటనే సరిచేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆ ప్రాసెస్​ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడంటే పుట్టిన తేదీ, అడ్రస్ ధ్రువీకరణకు ఆధార్, పాన్ అడుగుతున్నారుగానీ.. గతంలో పదో తరగతి సర్టిఫికెట్​నే ప్రామాణికంగా తీసుకునేవారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లలో విద్యార్థి పేరో, లేదంటే తల్లిదండ్రుల పేర్లలోనో, ఇంటి పేర్లలోనో చిన్నచిన్న తప్పులు, స్పెల్లింగ్‌ మిస్టేక్స్​ చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే.. కేవలం టెన్త్ సర్టిఫికెట్లో మాత్రమే చిన్న స్పెల్లింగ్‌ మిస్టేక్ ఉండి.. మిగిలిన ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లలో సరిగానే ఉంటే.. పెద్దగా ఇబ్బందిపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. సరిగా ఉన్న సర్టిఫికెట్లను పోల్చి చూసి.. టెన్త్​ ధ్రువపత్రంలోని తప్పును పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అయితే.. తప్పనిసరిగా ఆ తప్పును సరిచేయాల్సిందే అని భావిస్తే మాత్రం దానికి ప్రొసీజర్ ఉంది.

స్కూల్​కు వెళ్లాలి..

మీ పది సర్టిఫికెట్లో తప్పును సరిచేయాలనుకుంటే.. ముందుగా మీరు టెన్త్ చదివి స్కూల్​కు వెళ్లాలి. అక్కడి రికార్డుల్లో మీ వివరాలు ఎలా నమోదు చేశారో చూడాలి. ఆ తర్వాత టెన్త్ బోర్డ్ పరీక్షలకు ఫీజు చెల్లించినప్పుడు, ఎస్సెస్సీ బోర్డుకు నామినల్‌ రోల్స్‌లో పంపినప్పుడు మీ పేరు ఎలా పంపారో తెలుసుకోవాలి. ఇందులో.. రెండు విషయాలు ఉంటాయి. మీ స్కూల్​ వాళ్లు సరిగానే పంపినప్పటికీ.. బోర్డు వద్ద తప్పు జరిగి ఉంటే.. మీ స్కూల్ హెడ్‌ మాస్టర్‌ ద్వారా టెన్త్​ బోర్డుకు అప్లికేషన్ పంపించాలి. అలా కాకుండా.. మీ స్కూల్​ దగ్గరే మిస్టేక్ జరిగి ఉంటే.. ఆ తప్పును సరిచేయాలని పాఠశాల వారినే అడగాల్సి ఉంటుంది.

ఈ రెండు పద్ధతులు కాదనుకుంటే.. మీరే స్వయంగా టెన్త్ బోర్డు వద్దకు వెళ్లి, సర్టిఫికెట్లో తప్పులు సరిచేయడానికి ఇప్పుడు ఎలాంటి పద్ధతి అమల్లో ఉందో.. దాని ప్రకారం ముందుకు వెళ్లాలి. ఇందుకోసం అవసరమైన ఫీజు చెల్లించి, ఇతర ధ్రువ పత్రాలను దరఖాస్తుకు జతచేసి, బోర్డుకు అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

ఈ చదువు ఉద్యోగాల కోట - ఆకర్షణీయ వేతనం.. ఉజ్వల భవిష్యత్తు!

ఏంది బ్రో మీరు చెప్పే చదువు - ఒకటో తగరతి బుడ్డోడి స్కూల్‌ ఫీజు అక్షరాల రూ.4.27లక్షలా!

ABOUT THE AUTHOR

...view details