How to Complete B Tech Successfully : బహుళ జాతి సంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగానికి, మేటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు, అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలకూ బీటెక్ బాటలు వేస్తుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగమైనా, ఉన్నత చదువులైనా ముందస్తు ప్రణాళికతో సన్నద్ధమైతేనే విజయం సొంతమవుతుంది. అందువల్ల బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఉన్నప్పుడే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని నాలుగేళ్లూ ఆచరిస్తే భవిష్యత్తుకు తిరుగుండదు. తర్వాత ఏంటి? అనే ఆలోచన రాదు.
బీటెక్ విజయవంతంగా పూర్తి చెయాలంటే ఇవి ఫాలో అవ్వాల్సిందే!
- మొదటి సెమిస్టర్ నుంచే సాధన
- కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచుకోవడం
- ఆంగ్ల భాషపై పట్టు
- బృంద చర్చలు
- సందేహాల నివృత్తి
- బట్టీ విధానానం వద్దు
- స్వీయశిక్షణకు ప్రాధాన్యం
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు - ఆ కాలేజీల్లో ఎంతంటే? - ENGINEERING FEES in ap
మెటీరియల్ సేకరణ చాలా ముఖ్యం, దీని కోసం!
- ఒక్కో విషయంపై పలు పుస్తకాలను చదవాలి
- డిజిటల్ గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
- అంతర్జాలంలో సంబంధిత అంశాల గురించి కొత్త విషయాలు నేర్చుకోవాలి
- జర్నల్స్ చదవాలి
- అంతర్జాతీయ పత్రసమర్పణలు విశ్లేషించాలి
- సెమినార్లలో పాల్గొనాలి
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
- పరిశోధనలు గమనించాలి
సబ్జెక్టుపై లోతైన అవగాహన కోసం ఇలా చెయ్యాలి
- ప్రాజెక్టులకు అధిక సమయం కేటాయించడం
- పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవడం
- కంప్యూటర్స్ ద్వారా సాధన చేయడం
- నోట్సు రాసుకోవడం చేయాలి
- ప్రతి సబ్జెక్టు క్రమం తప్పకుండా చదవడం
- పరిశీలన
- పరిశోధనలపై ఆసక్తి
- ఇంజినీరింగ్ డ్రాయింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ
అనుకున్న లక్ష్యం సాధించాలంటే !
- వ్యక్తిగత క్రమశిక్షణ
- అన్ని సబ్జెక్టులపై అవగాహన
- 80 శాతం పైబడి మార్కులు వచ్చేలా కృషి
- ప్రాంగణ ఎంపికలపై దృష్టి సారించడం
- ప్రాంగణ ఎంపికలకు శిక్షణ తీసుకోవాలి
- మొదటి ఏడాది నుంచే సీ-లాంగ్వేజ్ నిష్ణాతులుగా మారాలి
- అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీలు నేర్చుకోవాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం అన్ని బ్రాంచులకు అవసరం
- సర్టిఫికేషన్ కోర్సులు చేయాలి
- ప్రాక్టికల్ నాలెడ్జి
- మొదటి సంవత్సరం నుంచే నైపుణ్యాల పెంచుకోవాలి
- ప్రాంగణ ఎంపికలో రేస్‌లో ముందుండాలి
- కోడింగ్‌పై పట్టు సాధించాలి
- నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేయాలా? లేదా పరిశ్రమలు స్థాపించాలా? లేక ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లాలా? అన్నదానిపై స్పష్టత
మంచి స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం మొబైల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఎట్టిపరిస్థితుల్లోను గురికాకూడదు.
పైన చెప్పిన అంశాలను ఫాలో అవడం ద్వాారా బీటెక్ విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాకుండా, తర్వాత ఏం చెయ్యాలనే అంశంపై సరైన అవగాహన పొందవచ్చు. విదేశాల్లో ఎంఎస్ అయినా, ఇంజినీరింగ్‌లో మంచి జాబ్ అయినా మీ విషయ పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది.
ONGC Apprentice Jobs : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతతో.. ఓఎన్జీసీలో అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!