High Paying AI Jobs :ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే అన్ని రంగాలకు వ్యాపించిన ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. భవిష్యత్‌లో కూడా దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి. పైగా మంచి సాలరీ కూడా వస్తుంది. అందుకే ఆ ఆర్టికల్‌లో భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఐదు ముఖ్యమైన ఏఐ కోర్సులు గురించి తెలుసుకుందాం.
1. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్
మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏఐ ఇన్నోవేషన్‌లో కీలక భూమిక పోషిస్తారు. వీరు ప్రధానంగా ఏఐ అల్గారిథమ్స్‌ను రూపొందిస్తారు. ఆటోమెటిక్ వాహనాలు, ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్ రంగాల్లోనూ వీరి పాత్ర చాలా కీలకం. మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్ తమ ఉద్యోగంలో బాగా రాణించాలంటే, బలమైన అనలెటికల్ స్కిల్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. అలాగే భారీ డేటా సెట్స్‌ను విశ్లేషించగలగాలి. అందుకే ఈ సామర్థ్యాలు అన్నీ ఉన్న మెషిన్ లెర్నంగ్ ఇంజినీర్స్‌కు లక్షల్లో జీతం ఉంటుంది.
2. రోబోటిక్స్ ఇంజినీర్స్
రోబోటిక్స్ ఇంజినీర్లు స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఇంటిలిజెంట్ మెషీన్లను రూపొందిస్తుంటారు. తయారీ, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో రోబోటిక్స్ ఇంజినీర్స్ అవసరం అవుతారు. ఆటోమేషన్‌కు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, మంచి నైపుణ్యం కలిగిన రోబోటిక్స్ ఇంజినీర్స్ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల వీరికి కూడా లక్షల్లో జీతాలు లభిస్తాయి.
3. డేటా సైంటిస్ట్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సంక్లిష్ట డేటా సెట్లను విశ్లేషించడంలో డేటా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. మార్కెటింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి పలు రంగాల్లో డేటా సైంటిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. డేటా అనాలసిస్, పాట్రన్స్ ఐడెంటిఫికేషన్, ఆల్గారిథమ్స్ క్రియేషన్ స్కిల్స్ ఉన్న డేటా సైంటిస్ట్లకు భారీ స్థాయిలో జీతభత్యాలు లభిస్తాయి.