1st class Student School Fee: చదువుకునే రోజులు పోయి చదువు "కొనే"రోజులొచ్చాయి. కార్పొరేట్ విద్య పేరిట తల్లిదండ్రులు మనోవేదన అనుభవిస్తున్నారు. లక్షల్లో వేతనాలున్నా టీచర్ల పనితీరు కారణంగా ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడ్డాయి. ఇదే అదునుగా గల్లీకి ఒకటిగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ విద్యా సంస్థలు వందలు, వేల రూపాయలు దాటి లక్షల్లో ఫీజులు వస్తూలు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన చదువు చెప్పరేమో భావన, సమాజంలో సోషల్ స్టేటస్ తగ్గుతుందేమో అన్న ఓరకమైన ఆత్మనూన్యతతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురువుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్‌పై ఉన్న మమకారంతో ప్రెస్టీజ్‌గా భావించి చదువుకోవటం కాదు చదువు "కొనే"ందుకు వెనుకాడటం లేదు. ఎంత ఎక్కువ ఫీజు ఉన్న పాఠశాలకు పంపితే తమ స్టేటస్ అంత ఎక్కువ అన్న భావనలో కొట్టుకుపోతున్నారు. ఫలితంగా కార్పొరేట్ విద్యా వ్యాపారం విరాజిల్లుతోంది. మధ్య తరగతి వారికి ప్రైవేటు విద్య అందని ద్రాక్షగా మారిందన్న ఆందోళనలతో ఫీజు నియంత్రణ చట్టం తెచ్చామని పాలకులు చెబుతున్నా అది అమలు కావటం లేదు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి ప్రైవేటు ఫీజు దోపిడీపై సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. తన కూతురును చేర్పించాలనుకుంటున్న పాఠశాలలో ఒకటో తరగతి ఫీజే రూ.4.27 లక్షలని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రైవేటు విద్య అందని ద్రాక్ష :ప్రైవేటు చదువులు మధ్య తరగతికి అందని దాక్షలా మారిందన్న ఆవేదన పై పోస్టులో మనకు అర్థం అవుతోంది. తన కూతురును చేర్పించే పాఠశాలలో ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలని పేర్కొన్నాడు. జైపూర్‌కు చెందిన రిషబ్ జైన్ భారీ స్కూల్ ఫీజు గురించి సోషల్ మీడియాలో పోస్టు ద్వారా చాలా మందికి తెలియజేశారు. చిన్నారి కోసం ఓ స్కూల యాజమాన్యాన్ని సంప్రదించగా అక్కడ ఫీజు రూ.4.,27 లక్షలని పేర్కొన్నట్లు తెలిపాడు. దేశంలో మిడిల్ క్లాస్ వారికి నాణ్యమైన విద్య ఓ లగ్జరీగా మారిందన్న విషయాన్ని ఈ పోస్టు తేటతెల్లం చేస్తోంది. ఒకటో తరగతి చేర్పించేందకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.2 వేలు, ఇక అడ్మిషన్ ఫీజు రూ.40 వేలు అని, రిఫండబుల్ ఫీజు రూ.5 వేలుగా ఆ పాఠశాల ఇచ్చిన రశీదులో ఉంది. వార్షిక ఫీజు రూ.2.52 లక్షలు, బస్సు ఫీజు రూ.1.08 లక్షలుగా పోస్టులో పేర్కొన్నారు. పాఠశాల యూనిఫామ్‌కు రూ.20 వేలు, ఇలా మొత్తం కలిపితే ఒకటో తరగతి బుడ్డోడి ఫీజు అక్షరాల రూ.4.27 లక్షలుగా తేలింది.