CBSE Results2024: దేశ వ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ ఫలితాలు రిలీజ్ కావడంతో సీబీఎస్ఈ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సమాయత్తమవుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్ఈ బోర్డు గత కొన్ని సంవత్సరాలుగా మెరిట్ జాబితాలను వెల్లడించని విషయం తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు జరిగాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాయి. దాదాపు 39లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో పదో తరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక సీబీఎస్ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే.. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.
ఆ రోజునే ఫలితాలు: ఫలితాల విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్ సీబీఎస్ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్స్‌ని పరిశీలిస్తే.. గత సంవత్సరం (2023) మే 12న ఈ ఫలితాలు విడుదల చేసింది. ఆ లెక్క ప్రకారం ఈసారి కూడా దాదాపు అదే సమయానికి CBSE 10th, 12th Results విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.