BEL Recruitment 2024 :ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) హైదరాబాద్లో శాశ్వత ప్రాతిపదికన ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ల గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- మొత్తం పోస్టులు : 32
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ-12
- టెక్నీషియన్ సీ-17
- జూనియర్ అసిస్టెంట్-3
విద్యార్హతలు
ఇంజినీరింగ్ అసెస్టెంట్ ట్రెయినీ పోస్టు కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్-సీ పోస్టు కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రికల్)తోపాటు ఏడాది అప్రెంటిస్‌షిప్ పూర్తిచేయాలి. లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై, మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఇక జూనియర్ అసిస్టెంట్ కోసం బీకాం/ బీబీఎం అర్హత సరిపోతుంది.
వయోపరిమితి
మూడు పోస్టులకూ 2024 జూన్ 1 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది. అయితే అభ్యర్థులు తెలంగాణ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలి. గడువు తేదీ ముగిసిన/ పనిచేయని ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోరు.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.250(18శాతం జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్టీ, ఎస్సీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పే స్కేల్
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ.24,500- రూ.90,000 వేతనం ఉంటుంది. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,500- రూ.82,000 వరకు జీతం ఉంటుంది.