ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / education-and-career

పదో తరగతి పరీక్ష ఫలితాలు బిగ్‌ అప్‌డేట్‌- అన్నీ అనుకూలిస్తే 25నే రిజల్ట్స్ - AP SSC Results 2024 update

AP 10th Class Exam Results update: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఏడాదిపాటు కష్టపడి చదివి రాసిన పరీక్షల ఫలితాల విడుదలపై బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూఈ నెలాఖరుకే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ విద్యా సంవత్సర ఫలితాలను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పదో తరగతి పరీక్ష ఫలితాలు
పదో తరగతి పరీక్ష ఫలితాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 10:33 AM IST

AP SSC Results 2024 update: ఆంధ్రప్రదేశ్‌ పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు బిగ్‌అప్‌డేట్‌ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు అన్నీ అనుకూలిస్తే ఈ నెల 25(ఏప్రిల్‌)నే ప్రకటించేలా సన్నద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఈసీ అనుమతి తప్పనిసరి. అధికారులైతే ఏప్రిల్‌ 25 ఫలితాల విడుదల టార్గెట్‌గా పెట్టుకున్నారు. 25 విడుదలకు ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే నెలాఖరుకు గ్యారెంటీగా విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే- ఈ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి

ఇప్పటికే పూర్తయిన మూల్యాంఖనం:

రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధిని, విద్యార్ధులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8తేదీతోనే ముగించారు. జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను కూడా ఇప్పుటికే దాదాపు పూర్తి చేశారు. ఇంకా పేపర్‌ వర్క్‌ కార్యక్రమాన్నిపూర్తి చేస్తున్నారు. విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద్‌ను పరీక్ష ఫలితాలపై ఈటీవీ భారత్‌ ప్రతినిధి సంప్రదించారు. గతేడాది మే-6న ఫలితాలు వెల్లడించామని అంతకంటే ముందే ఈ సంవత్సర వార్షిక ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్‌ దేవానంద్‌ చెప్పారు.

త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల

ఈ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి:

ఫలితాలు విడుదల చేయగానే ఎలాంటి సాకేంతిక పరమైన సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. అధికారికంగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యార్ధిని, విద్యార్ధుల తల్లిదండ్రులు స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునేలా అప్‌లోడింగ్‌ ప్రక్రియను చేస్తున్నారు. దాదాపు 6.3లక్షల రెగ్యులర్‌ విద్యార్ధులకు తోడు మరో లక్ష వరకు ప్రైవేట్‌లో పరీక్షలు రాసిన వారు ఒకే సారి చెక్‌ చేసుకున్న సర్వర్‌ సమస్య లేకుండా చూస్తున్నారు. అలాగే గ్రేడింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి మార్క్‌ షీట్స్‌ను ప్రిపేర్‌ చేస్తున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల హాల్‌టికెట్‌ నెంబర్‌ను పొందుపరిచి https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలనుచూసుకోవచ్చు. మార్కుల మెమోను తాత్కాలికంగా ఈ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఈ ఏడాది కల్పిస్తున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత పాఠశాలకు వెళ్ళి మార్క్‌ మెమోను అధికారికంగా తీసుకోవాలి. మెమోలను పాఠశాలకు పంపడంలో ఆలస్యం కాకుండా ఫలితాల వెల్లడితోపాటు పార్శిల్‌ ప్రక్రియను కూడా చేస్తున్నారు. మార్క్‌ షీట్‌ గ్రేడ్స్‌గా ఉంటుంది. ఎక్కడా ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు పొందారో తెలియదు. కేవలం సబ్జెట్‌ వారీగా గ్రేడింగ్‌ మాత్రమే ధృవీకరణ పత్రంలో ఉంటుంది.

ఇవి చదవండి:పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే- ఈ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి

ఏపీ ఇంటర్​ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్​ చూసుకోండిలా

ABOUT THE AUTHOR

...view details