తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

అగ్నివీర్ రిక్రూట్​మెంట్​లో 4 కీలక మార్పులు - మహిళలకు ప్రత్యేక అవకాశాలు! - Agniveer selection rules change

Agniveer Recruitment New Rules : సాయుధ దళాల్లో పనిచేయాలని ఆశపడుతున్న అభ్యర్థులు అందరికీ గుడ్ న్యూస్​. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈసారి అగ్నివీరుల ఎంపిక కోసం 4 కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Agniveer Recruitment 2024
Agniveer Recruitment New rules

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 10:32 AM IST

Agniveer Recruitment New Rules : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 22 తేదీలోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

భారత ప్రభుత్వం త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​, నేవీల్లోకి సమర్థులైన యువతీయువకులను తీసుకునేందుకు అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఎంపికయ్యే వారిని అగ్నివీరులు అని అంటారు. అయితే ఇండియన్ ఆర్మీ తాజా అగ్నివీర్ రిక్రూట్​మెంట్​లో 4 కొత్త నిబంధనలు కూడా తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

న్యూ రూల్స్​

  1. సైనికులు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో, ప్రతికూల వాతావరణాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అభ్యర్థులు తట్టుకోగలరో? లేదో? నిర్ధరణ చేసుకోవడానికి కొత్తగా అడాప్టబిలిటీ టెస్ట్​ నిర్వహిస్తున్నారు. దీనిని మెడికల్ ఎగ్జామినేషన్​ కంటే ముందే చేస్తారు. ఈ అడాప్టబిలిటీ టెస్ట్​లో ఉత్తీర్ణులైన అభ్యర్థులనే తరువాతి రౌండ్​కు పంపిస్తారు.
  2. అగ్నివీర్​ క్లర్క్ పోస్టును ఇప్పుడు 'ఆఫీస్ అసిస్టెంట్​'గా మార్చారు. ఈ పోస్టుల భర్తీ కోసం కొత్తగా టైపింగ్ టెస్ట్​ కూడా పెడుతున్నారు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్​ల స్థాయిలు అభ్యర్థుల వయస్సు, సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించబడతాయి.
  3. నకిలీ, అసలైన అభ్యర్థుల మధ్య తేడాను గుర్తించడానికి ఐరిస్ స్కాన్​ చేయనున్నారు. ఈ కొత్త బయోమెట్రిక్ వెరిఫికేషన్​ను ఈ తాజా రిక్రూట్​మెంట్​లో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు రిక్రూట్​మెంట్ ర్యాలీలో అభ్యర్థుల ఆధార్​ను వెరిఫై చేస్తారు. కనుక అభ్యర్థులు కచ్చితంగా తమ ఆధార్​తో లింకైన మొబైల్ నంబర్​లను మాత్రమే ఉపయోగించి ఎన్​రోల్ చేసుకోవాలి. సైబర్​కేఫ్​ల ద్వారా ఎన్​రోల్​ చేసుకున్న అభ్యర్థులు తాము ఉపయోగించిన ఈ-మెయిల్​ అడ్రస్​నే వాడుతూ ఉండాలి.
  4. గతంలో ఐఐటీ చేసిన అభ్యర్థులు మాత్రమే టెక్నికల్ రిక్రూట్​మెంట్​కు అర్హులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్​ అభ్యర్థులకు కూడా ఛాన్స్ ఇచ్చారు. కనుక పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా అగ్నివీర్ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.

అగ్నివీర్ - జాబ్స్​
ఇండియన్ ఆర్మీ తాజాగా రిక్రూట్​మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • మహిళా ఆర్మీ పోలీస్​
  • హవల్దార్​
  • సర్వేయర్​ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్​
  • కానిస్టేబుల్ ఫార్మా
  • నర్సింగ్ అసిస్టెంట్​
  • నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ

మహిళలకు ప్రత్యేక అవకాశాలు
'అగ్నివీర్ రిక్రూట్​మెంట్​ ప్రక్రియను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో కొన్ని కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాం. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు జనరల్ డ్యూటీ పోస్టులకే కాకుండా, టెక్నికల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. మహిళలకు ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మంచి అవకాశాలు లభించనున్నాయి. అందువల్ల ఈసారి మహిళా ఆర్మీ పోలీసు ఉద్యోగాలకు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది' అని ఆర్మీ రిక్రూట్​మెంట్​ ఆఫీస్​ లౌన్స్​డౌన్ డైరెక్టర్​ కల్నల్ పరితోష్ మిశ్రా పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకోండిలా!
అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఆర్మీ ఈ అగ్నివీర్ రిక్రూట్​మెంట్ చేపట్టింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 22 తేదీలోగా ఇండియన్ ఆర్మీ అధికారిక పోర్టల్​ https://joinindianarmy.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు సైన్యంలో తాత్కాలికంగా 4 ఏళ్లపాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది.

NALCOలో 277 ఇంజినీరింగ్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​లో 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details