తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త కారు కొనాలా? టాటా అప్​కమింగ్ మోడల్స్ లిస్ట్ ఇదే - సూపర్ వెహికల్స్ గురూ! - Upcoming Tata Cars 2024 - UPCOMING TATA CARS 2024

Upcoming Tata Cars In India 2024 : కార్ లవర్స్ అందరికీ శుభవార్త. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ త్వరలో 9 కార్లను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2024, 2025లో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం.

New Tata Cars 2024
New Tata Cars 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 12:46 PM IST

Upcoming Tata Cars In India 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్​ సహా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటుంది. అందులో భాగంగా 2024, 2025 సంవత్సరాల్లోనూ తమ సరికొత్త బ్రాండెడ్ కార్లను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ కార్లు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. Tata Curvv :టాటా కర్వ్ కారు ఆగస్టు 7న భారత మార్కెట్​లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండనున్నట్లు సమాచారం. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు టాటా కర్వ్ కారులో ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్ ఫ్యూయల్ వేరియంట్​లో ఈ కారు లభిస్తుంది.

2. Tata Curvv EV :టాటా కర్వ్ ఈవీ ధర రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు కూడా ఆగస్టు 7న భారత విపణిలో లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని తెలుస్తోంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఈ ఈవీ రానున్నట్లు సమాచారం. ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, యూవీ పనోరమిక్ సన్‌ రూఫ్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, ఏడీఏఎస్ సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉంటాయని సమాచారం.

3. Tata Avinya :టాటా అవిన్యా కారు వచ్చే ఏడాది జూన్​లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండనున్నట్లు అంచనా. అలాగే ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. 30 నిమిషాల్లోనే ఈ కారును ఫుల్ ఛార్జ్ చేయవచ్చని తెలుస్తోంది. పనోరమిక్ సన్‌ రూఫ్, సైడ్ వ్యూ కెమెరాలు ఈ కారుకు ఉండనున్నాయి.

4. Tata Nexon Fearless 1.2 iCNG :ఈ కారును టాటా కంపెనీ ఈ ఏడాది సెప్టెంబరులో మారెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ధర దాదాపు రూ.13.20 లక్షలు ఉంటుందని అంచనా. ఇది మాన్యువల్ ట్రాన్స్​మిషన్ కలిగి ఉంటుంది.

5. Tata Harrier EV :టాటా హారియర్ ఈవీ కారు 2025 మార్చిలో మార్కెట్​లో లాంఛ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ధర సుమారుగా రూ.24 లక్షల నుంచి రూ.28లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, న్యూ రియర్ బంపర్స్, ఎల్​ఈడీ టెయిల్ లైట్లు, డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే, పనోరమిక్ సన్​రూఫ్ వంటి ఫీచర్లతో ఈ కారు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారులో 5 సీటింగ్ సామర్థ్యం ఉండనున్నట్లు సమాచారం.

6. Tata Punch facelift :బడ్జెట్​లో కారు కొనాలనుకునేవారికి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ ధర రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుందని అంచనా. ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్​మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్​లెస్ ఛార్జర్, సన్​రూఫ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి. అలాగే 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​తో ఈ కారు రానుంది. ఇది 113 ఎన్ఎం టార్క్, 85 బీహెచ్​పీ పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును నవంబరులో మార్కెట్లోకి లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా మోటార్స్.

7. Tata Sierra EV :2025 మార్చిలో ఈ కారు మార్కెట్లో రానుందని అంచనా. ఈ కారు ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లష్​డోర్ హ్యాండిల్స్, వెంటిలేటెడ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ కారు లభించనుంది.

8. Tata Altroz EV :టాటా అల్ట్రోజ్ ఈవీ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 306 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. 26 kWh బ్యాటరీతో ఈ ఈవీ కారు అందుబాటులోకి రానుంది. ఈ కారును 8 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చని సమాచారం. టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారు ధర రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు వచ్చే ఏడాది సెప్టెంబరులో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి ఫీచర్లతో ఈ కారు రానుంది.

9. Tata Safari EV :టాటా సఫారీ ఈవీ వచ్చే ఏడాది మార్చిలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారు ధర రూ.26 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. 6,7 సీటింగ్ కెపాసిటీ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి.

ఆగస్టులో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే! ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతో తెలుసా? - Cars Launching In August 2024

రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh

ABOUT THE AUTHOR

...view details